News February 15, 2025
వికారాబాద్: ఈరోజు 37.1 డిగ్రీల వేడి ఉష్ణోగ్రత.!

వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని మండలాల్లో గ్రామాల్లో శనివారం రోజు 37.1 వేడి ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో చాలా ఎండగా కూడా ఉంటుందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇంత డిగ్రీలో ఉష్ణోగ్రత నమోదు కావడం ఇదే మొదటిసారి అని సూచించింది. కూలీలు, వృద్ధులు, విద్యార్థులు, వాహనదారులు, ముఖ్యంగా చిన్నపిల్లలు బయటికి రాకుండా ఉండాలని తెలిపారు.
Similar News
News December 8, 2025
ADB: ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో లోకల్ హాలిడే

రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ సూచన మేరకు, మూడు విడతలుగా జరిగే పంచాయతీ ఎన్నికలు ప్రాంతాల్లో లోకల్ హాలిడే ఉంటుందని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా ఒక ప్రకటనలో తెలియజేశారు. పోలింగ్ ప్రాంతాల్లో ఈనెల 11, 14, 17 తేదీలలో ప్రభుత్వ కార్యాలయాలు, లోకల్ బాడీ, ప్రభుత్వ సంస్థలే కాకుండా ప్రైవేట్ సంస్థలు కూడా వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని ఆదేశించారు.
News December 8, 2025
విశాఖ-రాయ్పూర్ గ్రీన్ఫీల్డ్ హైవే ఎప్పుడు పూర్తవుతుందంటే?

విశాఖ-రాయ్పూర్ ఎక్స్ప్రెస్ వే పనులు వేగంగా సాగుతున్నాయి. రూ.16,482 కోట్లతో నిర్మిస్తున్న ఈ ఎక్స్ప్రెస్ వే పనులు 2026 DECకి పూర్తి కానున్నాయి. మొత్తం 597KM మార్గాన్ని 465KMకి తగ్గిస్తూ 6 లైన్ల గ్రీన్ఫీల్డ్ హైవేగా నిర్మిస్తున్నారు. ఇది పూర్తైతే AP,ఒడిశా, ఛత్తీస్గఢ్ మధ్య రహదారి కనెక్టివిటీ మెరుగపడి ప్రయాణ సమయం 7 గంటలు తగ్గుతుంది. దీంతో టూరిజం,పారిశ్రామిక రవాణా, వ్యాపార అవకాశాలకు ఊతం లభించనుంది.
News December 8, 2025
వడ్డీ రేట్లు తగ్గించిన బ్యాంకులు

RBI <<18475069>>రెపో రేటును<<>> 0.25% మేర తగ్గించిన నేపథ్యంలో పలు బ్యాంకులు వడ్డీ రేట్లను సవరించాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా 0.25% తగ్గించాయి. రెపో అనుసంధానిత రుణ రేటును PNB 8.35 నుంచి 8.10%కి, BOB 8.15 నుంచి 7.90%కి, BOI 8.35 నుంచి 8.10%కి సవరించాయి. హోం లోన్ రేట్లు 7.10%, కార్ లోన్ రేట్లు 7.45% నుంచి ప్రారంభమవుతాయని BOM తెలిపింది.


