News February 15, 2025
వికారాబాద్: ఈరోజు 37.1 డిగ్రీల వేడి ఉష్ణోగ్రత.!

వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని మండలాల్లో గ్రామాల్లో శనివారం రోజు 37.1 వేడి ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో చాలా ఎండగా కూడా ఉంటుందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇంత డిగ్రీలో ఉష్ణోగ్రత నమోదు కావడం ఇదే మొదటిసారి అని సూచించింది. కూలీలు, వృద్ధులు, విద్యార్థులు, వాహనదారులు, ముఖ్యంగా చిన్నపిల్లలు బయటికి రాకుండా ఉండాలని తెలిపారు.
Similar News
News March 18, 2025
భోగాపురంలో బాంబు పేలి కార్మికుడి మృతి

భోగాపురంలో రాళ్లను పేల్చేందుకు ఏర్పాటు చేసిన బాంబు పేలి కార్మికుడు మృతి చెందాడు. ఈ ప్రమాదం సోమవారం జరిగింది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనుల్లో భాగంగా రహదారి ఏర్పాటుకు అడ్డంగా ఉన్న బండరాళ్లను తొలగించే క్రమంలో బాంబులు పెడుతుండగా ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో రామచంద్రపేటకు చెందిన కార్మికుడు కొత్తయ్య మృతి చెందాడు.
News March 18, 2025
అంతరిక్షం నుంచి వచ్చాక స్ట్రెచర్లపైనే బయటకు..

స్పేస్ ఎక్స్ క్రూ క్యాప్సుల్‌లో రేపు తెల్లవారుజామున భూమిపైకి రానున్న వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌పై అందరి దృష్టి నెలకొంది. క్యాప్సుల్ తెరుచుకున్న వెంటనే వీరిని స్ట్రెచర్స్‌లో బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంది. స్పేస్ నుంచి ఒక్కసారిగా భూమిపైకి రావడం, అంతరిక్షంలో నెలల పాటు ఉండటంతో వీరి శరీరంలో మార్పులు చోటు చేసుకోవడం కారణమని నిపుణులు చెబుతున్నారు. వీరు నడవలేని స్థితిలో ఉంటారని అంటున్నారు.
News March 18, 2025
‘బుడమేరు’కు శాశ్వత పరిష్కారం: మంత్రి

AP: గతేడాది విజయవాడను ముంచేసిన బుడమేరు వాగుపై అసెంబ్లీలో చర్చ జరిగింది. బుడమేరు సమస్యకు శాశ్వత పరిష్కార చర్యలు ప్రారంభించామని మంత్రి నిమ్మల తెలిపారు. ముంపు బాధితుల సమస్యల పరిష్కారానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని, నిధుల విడుదలకు మంత్రివర్గం సైతం ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. వెలగలేరు రెగ్యులేటర్ నుంచి కొల్లేరు సరస్సు వరకు కాలువల ప్రవాహ మార్గం సామర్థ్యాన్ని 10వేల క్యూసెక్కులకు పెంచుతామన్నారు.