News February 2, 2025

వికారాబాద్: ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలి: ఉమా

image

దివ్యాంగుల ఉపాధి, పునరావాస పథకానికి దివ్యాంగులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ఫిబ్రవరి 12 వరకు సమయం పొడిగించామని వికారాబాద్ జిల్లా సంక్షేమ అధికారిణి, ట్రైనీ కలెక్టర్ ఉమా హారతి తెలిపారు. దివ్యాంగులు ఆర్థిక స్వాలంబన పొంది అందరిలాగా సాధారణ జీవనం గడపడానికి వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, వ్యాపారాలను స్థాపించి జీవనోపాధి పొందాలన్న ఉద్దేశంతో ఈ పథకం ప్రారంభించారన్నారు.

Similar News

News September 18, 2025

తప్పిపోయిన చిన్నారుల ఆచూకీ లభ్యం

image

తుర్కపల్లి మండలం రుస్తాపురం సమీపంలోని చోక్లా తండాలో తప్పిపోయిన ఇద్దరు చిన్నారులను పోలీసులు గుర్తించి, వారి తల్లిదండ్రులకు అప్పగించారు. బస్వాపూర్ ప్రాజెక్టు పనుల కోసం మధ్యప్రదేశ్, బిహార్ నుంచి వచ్చిన కూలీల పిల్లలు గురువారం ఉదయం తప్పిపోయారు. తల్లిదండ్రులు తుర్కపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి, కొద్దిసేపటికే చిన్నారుల ఆచూకీ గుర్తించారు.

News September 18, 2025

జనగామ జిల్లాలో నిరుద్యోగుల నిరీక్షణ!

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తామని చెప్పిన రాజీవ్ యువ వికాసం పథకంపై నీలినీడలు కమ్ముకున్నాయి. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా రూ.50వేల యూనిట్లను కేటాయిస్తామని చెప్పిన ప్రభుత్వం నెలలు గడుస్తున్నా యూనిట్లు కేటాయించకపోవడంతో నిరుద్యోగులు నిరాశ చెందుతున్నారు. జనగామ జిల్లాలో 32వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడంతో యువత ఆశలు సన్నగిల్లుతున్నాయి.

News September 18, 2025

అర్హులైన వారెవరికీ పెన్షన్లు తొలగించలేదు: మంత్రి

image

AP: రాష్ట్రంలో అర్హులైన వారందరికీ ప్రభుత్వం పెన్షన్లు ఇస్తోందని శాసనమండలిలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. అర్హులైన వారెవరికీ పెన్షన్లు తొలగించలేదని, నోటీసులు అందిన వారికి 2 నెలల్లో వెరిఫికేషన్ పూర్తిచేయాలని వైద్యశాఖకు చెప్పామన్నారు. లబ్ధిదారులు చనిపోతే వారి ఫ్యామిలీలో మరొకరికి పెన్షన్ ఇస్తున్నట్లు తెలిపారు. 50-59 ఏళ్ల వయసున్న వారిలో 11.98 లక్షల మంది పెన్షన్ పొందుతున్నారని చెప్పారు.