News April 1, 2025
వికారాబాద్: ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి !

వికారాబాద్ జిల్లాలో రోజురోజుకు భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మంగళవారం జిల్లాలో 31 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదు కాగా మధ్యాహ్నం సమయంలో బయటికి రావాలంటే ప్రజలు బయపడుతున్నారు. దీంతో రోడ్లన్నీ బోసిపోయాయి. భారీ ఎండల నేపథ్యంలో వడదెబ్బ బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Similar News
News November 25, 2025
FLASH: బోరబండలో నిప్పు అంటించుకున్న హిజ్రాల్లో ముగ్గురి మృతి

ట్రాన్స్జెండర్ మోనాలిసాకు వ్యతిరేకంగా ఇటీవల బోరబండ బస్టాండ్లో ఓ వర్గం చేపట్టిన ఆందోళన తీవ్ర విషాదంగా మారింది. ఆందోళన సమయంలో పెట్రోల్ పోసుకున్న ట్రాన్స్జెండర్లలో చికిత్స పొందుతూ మంగళవారం నవనీత (24) బాలానగర్లోని ఓ ఆస్పత్రిలో మరణించింది. ఈ నెల 20న అప్సానా, 23న హీనా కూడా చనిపోయిన సంగతి తెలిసిందే. బోరబండ ఘటనలో చనిపోయిన వారి సంఖ్య మూడుకు చేరింది.
News November 25, 2025
బలవంతపు వాంతులతో క్యాన్సర్: వైద్యులు

బ్రష్ చేశాక చాలా మంది గొంతులోకి వేళ్లు పెట్టి బలవంతంగా వాంతులు చేసుకుంటారు. అలా పదే పదే చేస్తే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘కడుపులోని యాసిడ్ పదేపదే పైకి తన్నడం వల్ల అన్నవాహికలోని ‘టైల్స్’ లాంటి సున్నితమైన కణాలు అరిగిపోతాయి. ఇలా మాటిమాటికీ జరిగితే తీవ్రమైన సందర్భాల్లో క్యాన్సర్ కణాలుగా మారే ప్రమాదం ఉంటుంది. నాలుకను గీసుకొని ముఖం కడుక్కుంటే చాలు’ అని సూచించారు.
News November 25, 2025
5న తిరుమల దర్శనం టికెట్ల విడుదల

తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి TTD కీలక ప్రకటన వెలువరించింది. జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు రోజుకు 15000 చొప్పున రూ.300 టికెట్లు ఇస్తామని తెలిపింది. డిసెంబర్ 5వ తేదీన మధ్యాహ్నం 3గంటలకు ఆన్లైన్లో టికెట్లను విడుదల చేస్తామని వెల్లడించింది. ఆరోజు టీటీడీ వెబ్సైట్ ద్వారానే టికెట్లు బుకింగ్ చేసుకోవాలని సూచించింది.


