News February 12, 2025
వికారాబాద్: ఎండ వేడిలో దాహం తీర్చుకున్న ఓ కోడె

వేసవి సమీపిస్తున్న వేళ దాహంతో ఓ మూగ జీవి అల్లాడిన పరిస్థితి అనంతగిరిలో కనిపించింది. వికారాబాద్ నుంచి తాండూర్ వెళ్లే మార్గంలో అనంతపద్మనాభ స్వామి ఆలయం ఎదురుగా ఉన్న వాటర్ ట్యాంక్ వద్ద ఓ కోడె దాహం కోసం బొట్టు బొట్టు కారుతున్న నల్లా ద్వారా దాహం తీర్చుకుంటుంటే ఓ జంతు ప్రేమికుడు వెళ్లి పక్కన ఉన్న నల్లా తిప్పి కోడె దాహం తీర్చాడు. అందుకు జంతు ప్రేమికులు అభినందిస్తున్నారు.
Similar News
News March 26, 2025
పల్నాడు జిల్లాలో శాంతి భద్రతలపై సీఎం సమీక్ష

పల్నాడు జిల్లాలో శాంతి భద్రతలకు సంబంధించి సీఎం చంద్రబాబు ఎస్పీ శ్రీనివాసరావు, కలెక్టర్ పి. అరుణ్ బాబుతో సమీక్షించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొమ్మిది నెలల కాలంలో జిల్లాలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రజలకు రక్షణ, ప్రశాంత వాతావరణం అందించామని వారు సీఎంకు తెలిపారు. ముఖ్యంగా మహిళలకు సంబంధించి శక్తి యాప్ వంటి వాటిపై ఎస్పీ నుంచి సీఎం సమాచారం తీసుకున్నారు.
News March 26, 2025
కొడంగల్: తిరుపతిరెడ్డిపై పోస్ట్.. యువతిపై కేసు నమోదు

సీఎం రేవంత్ రెడ్డి అన్న, కాంగ్రెస్ కొడంగల్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ తిరుపతిరెడ్డి ఈనెల 22న కోస్గి మండలం బిజ్జూరంలో పర్యటించారు. ఆ సమయంలో ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యువతిపై కేసు నమోదు చేసినట్లు SIబాల్‌రాజ్ తెలిపారు. తిరుపతిరెడ్డి భూకబ్జాలు చేసేందుకు వచ్చాడని హన్మాన్‌పల్లి వాసి పద్మ వాట్సాప్ గ్రూపుల్లో ఆధారాలు లేకుండా తప్పుడు మెసేజ్ చేసిందని NSUIఅధ్యక్షుడు అశోక్ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశామన్నారు.