News March 5, 2025
వికారాబాద్: ఎల్ఆర్ఎస్పై 25% డిస్కౌంట్: కలెక్టర్ ప్రతీక్ జైన్

ఎల్ఆర్ఎస్ ప్రక్రియను సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం కొన్ని నూతన నిర్ణయాలు తీసుకున్నదని, ఎల్ఆర్ఎస్ ఫ్లాట్ రిజిస్ట్రేషన్ సమయంలో రుసుము చెల్లించి, క్రమబద్ధీకరణ చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో ఏంపీవోలు పంచాయతీ సెక్రటరిలతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. నిబంధనలను పాటిస్తూ ఎల్ఆర్ఎస్ చేయాలని అధికారులకు తెలిపారు.
Similar News
News September 15, 2025
వనపర్తి: ‘ప్రజాపాలన దినోత్సవానికి ఏర్పాట్లు చేయండి’

వనపర్తి జిల్లాలో సెప్టెంబర్ 17న ప్రజా పాలన దినోత్సవం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. వేడుకలు ఐడీఓసీ ప్రాంగణంలో జరుగుతాయని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీఫ్ విప్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి హాజరై జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని కలెక్టర్ తెలిపారు.
News September 15, 2025
ఏలూరు ప్రాధాన్యతా అంశాలపై వివరించిన కలెక్టర్

ఏలూరు కలెక్టర్ వెట్రి సెల్వి సోమవారం AP సచివాలయంలో జిల్లా కలెక్టర్ల సదస్సులో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో జిల్లాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, పాలన పారదర్శకతపై చర్చలు నిర్వహించారు. కలెక్టర్ వెట్రి సెల్వి జిల్లా ప్రాధాన్యతా అంశాలను ప్రస్తావించారు.
News September 15, 2025
HYD: సబ్సిడీ.. అర్హులకు ఎప్పుడు?

అర్హులైన వారికి రూ.500కే సిలిండర్లు అందజేస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కానీ, గ్రేటర్ HYD పరిధిలో సుమారు 60 వేల మందికి పైగా అర్హులకు గ్యాస్ సిలిండర్లకు సబ్సిడీ రాకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సబ్సిడీ రానివారు ఎక్కడికి పోవాలో తెలియటం లేదని, అధికారులు దీనిపై స్పందించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికీ పలువురు ప్రజాపాలన దరఖాస్తులు పట్టుకొని తిరుగుతున్నట్లు తెలిపారు.