News March 25, 2025

వికారాబాద్: ‘ఓవర్సీస్ స్కాలర్షిప్స్‌కు దరఖాస్తు చేసుకోవాలి’

image

అంబేడ్కర్ ఓవర్సీస్ స్కాలర్ షిప్ పథకం ద్వారా అర్హులైన ఎస్సీ విద్యార్థులు విదేశాలలో చదువుకునేందుకు దరఖాస్తు చేసుకోవాలని VKB జిల్లా ఎస్సీ వెల్ఫేర్ అధికారి మల్లేశం తెలిపారు. రిజిస్ట్రేషన్ కోసం అర్హులైన విద్యార్థులకు మే 19 వరకు అవకాశం ఉందన్నారు. https://telanganaepass.cgg.gov.in వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు కలెక్టరేట్లోని ఎస్సీ వెల్ఫేర్ కార్యాలయాన్ని సంప్రదించవచ్చన్నారు.

Similar News

News April 20, 2025

‘చట్టాలన్ని ఆడవారికే’ .. భార్య టార్చర్‌తో భర్త సూసైడ్

image

భార్య వేధింపులు తాళలేక యూపీలో మోహిత్ కుమార్ అనే ఫీల్డ్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆస్తినంతా భార్య వారి కుటుంబసభ్యుల పేరు మీదకు మార్చాలని, లేకుంటే తనపై వరకట్న వేధింపుల కేసు పెడతానని బెదిరించిందని తెలిపారు. ప్రస్తుతమున్న చట్టాలన్నీఆడవారికే అనుకూలంగా ఉన్నాయని, మగవారిని రక్షించేలా చట్టాలుంటే తాను ఈ నిర్ణయం తీసుకునే వాడిని కాదని వీడియో రికార్డు చేసి ప్రాణాలు వదిలారు.

News April 20, 2025

మెగాస్టార్ మూవీ.. VFX కోసం రూ.75 కోట్లు?

image

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతోన్న ‘విశ్వంభర’లో కీలకంగా ఉన్న VFX కోసం భారీగా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం వీటి కోసమే UV క్రియేషన్స్ రూ.75 కోట్లు వెచ్చించినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. హాలీవుడ్ చిత్రాలకు వర్క్ చేసిన ప్రముఖ వీఎఫ్ఎక్స్ స్టూడియోలతో పనిచేస్తున్నట్లు వెల్లడించాయి. ఈ సోషియో ఫాంటసీ మూవీకి వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా జులైలో విడుదల కానున్నట్లు సమాచారం.

News April 20, 2025

గుంటూరు: 19 పరుగులు చేసిన రషీద్

image

వాంఖండే వేదికగా జరుగతున్న చైన్నై -ముంబాయి మ్యాచ్‌లో గుంటూరు కుర్రోడు షేక్ రషీద్ ఆదివారం పర్వాలేదనింపించారు. ఓపెనర్‌గా వచ్చి 20 బంతుల్లో 19 పరుగులు చేశాడు. అందులో మూడు ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. శాంట్నర్ వేసిన బౌలింగ్‌లో స్టంప్ అవుట్ అయ్యి వెనుదిరిగారు. కాగా.. దీనికంటే ముందు మ్యాచ్‌లో ఆరంగేట్రం చేసిన రషీద్ 27 పరుగులు చేసిన విషయం తెలిసిందే.

error: Content is protected !!