News February 3, 2025
వికారాబాద్: కరాటేతో మానసిక స్థైర్యం పెరుగుతుంది: స్పీకర్

కరాటేతో మానసిక స్థైర్యంతో పాటు శారీరక దృఢత్వం పెరుగుతుందని తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం వికారాబాద్ పట్టణంలోని క్లబ్ ఫంక్షన్ హాల్‌లో ఆరో నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో భాగంగా గెలుపొందిన కరాటే క్రీడాకారులకు స్పీకర్ ప్రసాద్ కుమార్ బహుమతులను ప్రదానం చేశారు. చిన్నతనం నుంచి కరాటే శిక్షణ ఇస్తే వారు మానసిక ధైర్యంతో సంసిద్ధులు అవుతారన్నారు.
Similar News
News November 4, 2025
ASF: ‘పత్తి కొనుగోలులో పరిమితి ఎత్తివేయాలి’

ఎకరానికి 7 క్వింటాళ్ల పత్తి మాత్రమే కొనుగోలు చేయాలనే సీసీఐ నిబంధనను కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఎత్తివేయాలని బీసీ యువజన సంఘం ఆసిఫాబాద్ జిల్లా నాయకుడు ప్రణయ్ డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసి ఆయన మాట్లాడారు. ఈ సంవత్సరం తేమ, నాణ్యతతో పాటు పరిమితుల పేరుతో కొత్త నిబంధనలు పెట్టి రైతులను సీసీఐ ఇబ్బంది పెడుతోందని పేర్కొన్నారు.
News November 4, 2025
బోయిన్‌పల్లిలో దారుణం.. చిన్నారిపై డాన్స్ మాస్టర్ వేధింపులు

ఓల్డ్ బోయిన్‌పల్లిలోని సుబ్బు డాన్స్ స్టూడియో నిర్వాహకుడు జ్ఞానేశ్వర్ నాలుగేళ్ల బాలికపై అసభ్యంగా ప్రవర్తించాడు. 2 నెలలుగా డాన్స్ స్కూల్‌కు వెళ్తున్న చిన్నారి ఈమధ్య ఆకస్మికంగా మానేసింది. చిన్నారి చెప్పిన వివరాల మేరకు తల్లిదండ్రుల ఫిర్యాదుతో బోయిన్‌పల్లి పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. స్టూడియోను మూసివేసినట్లు ఉత్తర మండల డీసీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు.
News November 4, 2025
పాక్ ప్లేయర్ హరీస్ రవూఫ్‌పై ఐసీసీ వేటు

ఆసియా కప్‌లో కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించిన ఆటగాళ్లపై ICC చర్యలు తీసుకుంది. పాక్ ప్లేయర్ హరీస్ రవూఫ్‌పై 2 మ్యాచుల బ్యాన్ విధించింది. 24 నెలల వ్యవధిలో 4 డీమెరిట్ పాయింట్లు తెచ్చుకున్నందుకు ఈ వేటు వేసింది. 2 మ్యాచుల్లో 30% చొప్పున ఫీజులో కోత పెట్టింది. మరో ఆటగాడు ఫర్హాన్‌కు ఒక డీమెరిట్ పాయింట్ ఇచ్చింది. ఇక <<17831364>>సూర్య<<>>కు మ్యాచ్ (14వ తేదీ) ఫీజులో 30% కోత, 2 డీమెరిట్ పాయింట్లను విధించింది.


