News February 3, 2025

వికారాబాద్: కరాటేతో మానసిక స్థైర్యం పెరుగుతుంది: స్పీకర్

image

కరాటేతో మానసిక స్థైర్యంతో పాటు శారీరక దృఢత్వం పెరుగుతుందని తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం వికారాబాద్ పట్టణంలోని క్లబ్ ఫంక్షన్ హాల్‌లో ఆరో నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో భాగంగా గెలుపొందిన కరాటే క్రీడాకారులకు స్పీకర్ ప్రసాద్ కుమార్ బహుమతులను ప్రదానం చేశారు. చిన్నతనం నుంచి కరాటే శిక్షణ ఇస్తే వారు మానసిక ధైర్యంతో సంసిద్ధులు అవుతారన్నారు.

Similar News

News February 11, 2025

షీలానగర్-పోర్టు రోడ్డులో యాక్సిడెంట్ 

image

షీలానగర్-పోర్టు రోడ్డులో సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తిని కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గాజువాకకు చెందిన ఎం.నరసింహారావు సైకిల్‌పై టీ వ్యాపారం చేస్తూ జీవిస్తున్నాడు. ఈ నేపథ్యంలో మంగళవారం టీ పట్టుకొని వెళ్తుండగా కారు వేగంగా వచ్చి ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గాజువాక ట్రాఫిక్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలపై ఆరా తీశారు.

News February 11, 2025

పాడేరు: యథావిధిగా ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు  

image

బుధవారం జరగాల్సిన(రేపు) ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలను యథావిధిగా కొనసాగిస్తామని జిల్లా కలెక్టర్ ఏ.ఎస్ దినేశ్ కుమార్ మంగళవారం తెలియజేశారు. అయితే ఈనెల 11వ తేదీన రద్దు చేసిన ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షను తిరిగి ఎప్పుడు నిర్వహించేది ప్రకటిస్తామని చెప్పారు. >Share it

News February 11, 2025

నగరి ఎమ్మెల్యే సోదరుడు వైసీపీలో చేరికకు బ్రేక్!

image

టీడీపీ నేత, నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాశ్ సోదరుడు గాలి జగదీశ్ వైసీపీలో చేరికకు తాత్కాలిక బ్రేక్ పడింది. రేపు వైసీపీలో చేరేందుకు మాజీ సీఎం జగన్‌తో వైసీపీ కేంద్రకార్యాలయంలో భేటీ అయ్యారు. గాలి జగదీశ్ చేరికకు మాజీ మంత్రి రోజా అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో ఆయన చేరికను వాయిదా వేసినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో గాలి జగదీశ్ నగరి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నట్లు సమాచారం.

error: Content is protected !!