News March 11, 2025

వికారాబాద్: కారుణ్య నియామకాలకు పచ్చ జెండా

image

వికారాబాద్ జిల్లాలో కారుణ్య నియామకాలకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. ప్రభుత్వం జిల్లాకు మొత్తం 81 పోస్టులను మంజూరు చేసింది. అందులో 60 ఆఫీసర్ సబార్డినేట్ పోస్టులు, కొత్తగా 18 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, మరో 3 టైపిస్టు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో జిల్లాలో కారుణ్య నియామకాల కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న పలు కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది.

Similar News

News November 21, 2025

కొత్త లేబర్ కోడ్‌లో ఉపయోగాలు ఇవే..

image

* వారానికి 48 గంటల పని, ఓవర్ టైమ్ వర్క్ చేస్తే రెట్టింపు వేతనం
* కార్మికులకు తప్పనిసరిగా అపాయింట్‌మెంట్ లెటర్లు
* ఫిక్స్‌ట్-టర్మ్ ఎంప్లాయిమెంట్ ద్వారా కాంట్రాక్ట్ వర్కర్లకు భద్రత, పర్మనెంట్ ఉద్యోగుల మాదిరి చట్టపరణమైన రక్షణ
* అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సామాజిక న్యాయం
* భూగర్భ మైనింగ్, భారీ యంత్రాల వంటి పనులకూ మహిళలకు అనుమతి

News November 21, 2025

హనుమాన్ జంక్షన్: విద్యార్థినులకు వేధిస్తున్న ఆకతాయిల అరెస్ట్

image

హనుమాన్ జంక్షన్ ఆర్‌టీసీ బస్టాండ్ పరిధిలో ఆకతాయిల హంగామా సృష్టించారు. ద్విచక్ర వాహనాలపై ఆర్టీసీ ఆవరణలో తిరుగుతూ కాలేజీ విద్యార్థినులతో అసభ్యకరంగా, ఎగతాళిగా మాట్లాడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వెంటనే స్పందించిన జంక్షన్ పోలీసులు ఆకతాయిలను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

News November 21, 2025

VKB: అనంత పద్మనాభుడికి భారీ ఆదాయం

image

వికారాబాద్ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో కార్తీక మాస పెద్ద జాతర హుండీ లెక్కింపు జరిగింది. 15 రోజుల జాతర ఉత్సవాల్లో భక్తులు వేసిన హుండీలో రూ.6,02,675 వచ్చినట్లు EO నరేందర్ తెలిపారు. అధికారుల సమక్షంలో నిఘా ఏర్పాటు చేసి కానుకలను లెక్కించామని అన్నారు. శుక్రవారం జాతర వేడుకల్లో భాగంగా ఈ లెక్కింపు నిర్వహించారు.