News March 11, 2025
వికారాబాద్: కారుణ్య నియామకాలకు పచ్చ జెండా

వికారాబాద్ జిల్లాలో కారుణ్య నియామకాలకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. ప్రభుత్వం జిల్లాకు మొత్తం 81 పోస్టులను మంజూరు చేసింది. అందులో 60 ఆఫీసర్ సబార్డినేట్ పోస్టులు, కొత్తగా 18 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, మరో 3 టైపిస్టు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో జిల్లాలో కారుణ్య నియామకాల కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న పలు కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది.
Similar News
News March 27, 2025
కిలో రూ.3.. కష్టాల్లో టమాటా రైతులు

TG: గిట్టుబాటు ధరలు లేక, కిలో టమాటా రూ.3కే అమ్ముకోవాల్సిన పరిస్థితి రావడంతో రైతులు కంటతడి పెడుతున్నారు. రంగారెడ్డి (D) కొందుర్గ్ (M) రైతు నర్సింహులు 56 టమాటా పెట్టెలు(ఒక్కోదాంట్లో 30kg) మహబూబ్‌నగర్ రైతుబజారుకు తీసుకెళ్లారు. 39పెట్టెలకు దళారులు రూ.3,500 చెల్లించారు. మిగతావి కొనకపోవడంతో టమాటాలను రోడ్డుపక్కన పారబోస్తూ ఆవేదన చెందారు. మరోవైపు, బహిరంగ మార్కెట్లో కిలో టమాటా రూ.10- రూ.20 వరకు ఉంది.
News March 27, 2025
ఎల్లారెడ్డిపేట: మోర్చా కార్యదర్శిగా బుర్కా సంగీత

రాజన్న సిరిసిల్ల జిల్లా మహిళా మోర్చా కార్యదర్శిగా బుర్కా సంగీత నియమించినట్లు ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షులు పొన్నాల తిరుపతిరెడ్డి తెలిపారు. బుర్కా సంగీత గత 20 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా, భూత్ అధ్యక్షరాలిగా, మండల నాయకురాలిగా భారతీయ జనతా పార్టీలో వివిధ పదవులు పొంది ఇప్పుడు మహిళా మోర్చా జిల్లా కార్యదర్శిగా నియమించడం సంతోషకరమని మండల నాయకులు అందరూ అభినందనలు తెలిపారు.
News March 27, 2025
‘తెలుగు నేర్చుకో..’ అక్బరుద్దీన్ ఒవైసీపై మాజీ ఐఏఎస్ ఫైర్

TG: ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే <<15896404>>అక్బరుద్దీన్‌పై<<>> మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళీ ఫైరయ్యారు. ‘మంత్రి సీతక్కకు హిందీ రాదు సరే.. హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగిన నీకు తెలుగు ఎందుకు రాదు?’ అని ప్రశ్నించారు. రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు మాట్లాడే తొలి అధికార భాష తెలుగును నేర్చుకోవాలనే బాధ్యత ఉండాలని హితవు పలికారు. తెలుగు రానప్పుడు సభ్యులు లేవనెత్తే సమస్యలు ఎలా అర్థమవుతాయని దుయ్యబట్టారు.