News February 18, 2025
వికారాబాద్: కేసులు పెండింగ్ ఉంచరాదు: ఎస్పీ

పాత కేసులను పెండింగ్ పెట్టరాదని వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి సిబ్బందికి సూచించారు. మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ ఎస్టీ , పోక్సో కేసులపై దృష్టి పెట్టాలన్నారు. 100 డైల్ వస్తే నిర్లక్ష్యం వహించొద్దని తెలిపారు. రోడ్డు ప్రమాదాలపై దృష్టి పెట్టాలన్నారు.
Similar News
News November 11, 2025
సంగారెడ్డి: మండల వనరుల కేంద్రాలకు నిధులు విడుదల

సంగారెడ్డి జిల్లాలోనీ మండల వనరుల కేంద్రాలకు (ఎంఆర్సీ), క్లస్టర్ రిసోర్స్ సెంటర్(సీఆర్సీ)ల నిర్వహణకు నిధులు విడుదలయ్యాయని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు అన్నారు. 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించి 50 శాతం నిధులను విద్యాశాఖ మంజూరు చేసిందని తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో 29 ఎంఆర్సీలకు రూ.13,05,000, 85 సీఆర్సీలకు రూ.14,02,500 చొప్పున విడుదల అయ్యాయని పేర్కొన్నారు.
News November 11, 2025
కేంద్ర వైఫల్యం వల్లనే ఢిల్లీలో పేలుడు: కాంగ్రెస్ నేత

ఢిల్లీలో పేలుడు ఘటన పూర్తిగా కేంద్రం వైఫల్యమేనని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ఆరోపించారు. ఫరీదాబాద్‌లో 360 KGల పేలుడు పదార్థాలు దొరికినా ప్రభుత్వం నిరోధించలేకపోయిందన్నారు. ‘ఆరేళ్ల క్రితం పుల్వామాలో 350 KGల RDX దొరికింది. ఇటీవల ఢిల్లీ ATCపై సైబర్ ఎటాక్‌తో 800 ఫ్లైట్స్‌కు ఆటంకం కలిగింది. ఇలాంటివి జరుగుతున్నా ప్రభుత్వం నుంచి స్పందన ఉండడం లేదు’ అని విమర్శించారు. దేశంలో భయంకర పరిస్థితులున్నాయన్నారు.
News November 11, 2025
CM పర్యటనకు పటిష్ఠ బందోబస్తు: DIG

రాయచోటి నియోజకవర్గానికి విచ్చేస్తున్న సీఎం చంద్రబాబు పర్యటనకు పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ వెల్లడించారు. మంగళవారం హెలిపాడ్ ప్రాంగణం, ప్రజా వేదిక, కార్యకర్తల వేదికతో పాటు ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలను ఎస్పీ ధీరజ్‌తో కలిసి ఆయన పరిశీలించారు.


