News February 1, 2025
వికారాబాద్: గ్రంథాలయాన్ని ఆధునిక హంగులతో నిర్మిస్తాం: కలెక్టర్

ఆధునిక హంగులతో నూతన గ్రంథాలయాన్ని తీర్చిదిద్దుకుందామని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ పట్టణ కేంద్రంలోని జిల్లా గ్రంథాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వివిధ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న అభ్యర్థులతో కలెక్టర్ మాట్లాడుతూ.. వారికి కావలసిన అవసరాల గురించి అడిగి తెలుసుకున్నారు. యువత అభ్యర్థన మేరకు గ్రంథాలయంలో కంప్యూటర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
Similar News
News October 19, 2025
మళ్లీ పంచాయతీ రాజ్ చట్ట సవరణ!

TG: స్థానిక ఎన్నికల్లో ముగ్గురు పిల్లలున్నా పోటీ చేసేందుకు అర్హులని ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది. దీని కోసం పంచాయతీ రాజ్ చట్టం-2018, 21(ఏ)ను సవరణ చేయాల్సి ఉంది. ఈ మేరకు ప్రభుత్వం ఆ శాఖను ఆదేశించింది. ఈ బిల్లును గవర్నర్ ఆమోదిస్తే వచ్చే స్థానిక ఎన్నికల్లో అమల్లోకి వస్తుంది. గతంలో గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేయడం, స్థానిక ఎన్నికలకు చేసిన రిజర్వేషన్లు తదితరాల కోసం చట్టాన్ని సవరించారు.
News October 19, 2025
21న విశాఖ రానున్న మంత్రి బాల వీరాంజనేయ స్వామి

మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి మంగళవారం విశాఖ రానున్నారు. ఆరోజు ఉదయం 4:35 గంటలకు విశాఖ రైల్వే స్టేషన్కు చేరుకుని అక్కడి నుంచి సర్క్యూట్ హౌస్కి వెళ్తారు. ఉదయం 9:30 గంటలకు పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించే పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవంలో పాల్గొంటారు. అనంతరం జీవీఎంసీలో జరిగే రివ్యూలో పాల్గొని ఆరోజు సాయంత్రం 7 గంటలకు ట్రైన్లో బయలుదేరి ఒంగోలు వెళ్తారు.
News October 19, 2025
యాప్ల సంఖ్య తగ్గించాం: DEO రేణుక

ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల విలువైన బోధన సమయాన్ని దృష్టిలో ఉంచుకొని పూర్వం అమల్లో ఉన్న యాప్లను తగ్గించి కనిష్ఠ సంఖ్యకు తీసుకొచ్చినట్లు డీఈవో సి.వి. రేణుక తెలిపారు. అసెస్మెంట్ పుస్తకాల విషయంలో ఉపాధ్యాయుల అభ్యంతరాలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయన్నారు. పిల్లలకు మధ్యాహ్న భోజన పథక వివరాలు అందించడానికి ప్రధానోపాధ్యాయుల విధులలో భాగమని అన్నారు.