News February 15, 2025

వికారాబాద్: చికెన్ తినాలంటే భయమేస్తోంది: ప్రజలు

image

వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న పలు మండలాలలో, గ్రామాలలో చికెన్ తినాలంటే ప్రజలు భయమేస్తోందని తెలిపారు. బర్డ్ బ్లూ సోకడం ద్వారా ఎలాంటి వ్యాధులు సోకుతాయని భయాందోళన చెందుతున్నారు. దీని గురించి అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలని కోరుతున్నారు. సండే అనగానే ముందుగా గుర్తుకొచ్చేది చికెన్. దీంతో ఎలాంటి వ్యాధి వస్తుందోనని చికెన్ ప్రియులు భయపడుతున్నారు. 

Similar News

News December 2, 2025

HNK: స్థానిక ఎన్నికలు.. షెడ్యూల్ ఇదే!

image

జిల్లాలోని 12 మండలాల్లో 3 విడతలుగా స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, హుజురాబాద్(C) కమలాపూర్‌లో 1వ విడత 11న, వర్ధన్నపేట(C)లోని హసన్పర్తి, ఐనవోలు, ఘనపూర్ పరిధిలోని ధర్మసాగర్, వేలేరు, పరకాల మండలాల్లో 2వ విడత 14న, పరకాల పరిధిలోని దామెర, నడికూడ, ఆత్మకూరు, భూపాలపల్లి నియోజకవర్గంలోని శాయంపేటలో 3వ విడత 17న ఎన్నికలు జరగనున్నాయి.

News December 2, 2025

నల్గొండ: స్టోన్ క్రషర్స్ యజమానుల సమ్మె బాట షురూ!

image

నల్గొండ జిల్లాలో స్టోన్ క్రషర్స్ యజమానులు సమ్మెబాట పట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలతో స్టోన్ క్రషర్ మిల్లులు నడపటం కష్ట సాధ్యంగా మారిందని వాటి యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల్లో సడలింపులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం నుంచి జిల్లాలోని స్టోన్ క్రషర్స్ మిల్లులను బంద్ పెట్టిన వాటి యజమానులు సమ్మెబాట పట్టారు.

News December 2, 2025

ధన్వాడ: ఎన్నికల చిత్రాలు.. ఉదయం బీఆర్ఎస్, రాత్రికి కాంగ్రెస్!

image

ధన్వాడ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా విచిత్ర రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. ఉదయం కాంగ్రెస్ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరిన నీరిటి రామచంద్రయ్య సర్పంచ్ స్థానానికి నామినేషన్ వేశారు. అయితే, రాత్రికి మళ్లీ డీసీసీ మాజీ అధ్యక్షుడు శివకుమార్ రెడ్డి సమక్షంలో ఆయన తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. ఈ అనూహ్య పరిణామంపై స్థానిక ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.