News February 8, 2025
వికారాబాద్: జండూబామ్ రాసి కొట్టేస్తున్నారు.. జర జాగ్రత్త..!

ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలి ఆభరణాలను అపహరించిన దంపతులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు నవాబ్‌పేట్ SI అరుణ్ కుమార్ అన్నారు. SI వివరాలిలా.. మాదిరెడ్డిపల్లికి చెందిన వృద్ధురాలు రుక్కమ్మ జనవరి 29న ఇంట్లో ఒంటరిగా ఉండగా కుంటి సునీత, వెంకటేశ్ దంపతులు వృద్ధురాలి కళ్లకు జండూబాం రుద్ది మేడలో ఉన్న బంగారం దొంగలించినట్లు పేర్కొన్నారు. వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.
Similar News
News October 20, 2025
జగిత్యాల జిల్లాకు వర్ష సూచన.. ఎల్లో అలెర్ట్ జారీ

రానున్న 2-3 గంటల్లో జగిత్యాల జిల్లాలో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గరిష్ట ఉపరితల గాలి వేగం గంటకు 40 కి.మీ వరకు ఉండే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ మేరకు ఎల్లో హెచ్చరిక జారీ చేశారు. రైతులు, ప్రజలు వర్షం పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
News October 20, 2025
బిహార్ తొలి విడత ఎన్నికలకు ముందు పీఎం కిసాన్ నిధులు విడుదల?

దీపావళి సందర్భంగా కేంద్రం PM కిసాన్ 21వ విడత నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తుందని వార్తలు వచ్చినా మోదీ సర్కార్ ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే నవంబర్ మొదటి వారంలో దేశవ్యాప్తంగా రైతులకు రూ.2వేల చొప్పున జమ చేసే అవకాశం ఉందని నేషనల్ మీడియా పేర్కొంది. బిహార్ అసెంబ్లీ తొలి విడత ఎన్నికలకు (నవంబర్ 6) ముందు కేంద్రం దీనిపై ప్రకటన చేయవచ్చని తెలిపింది. ఈ-కేవైసీ పూర్తి కాని రైతులకు డబ్బులు జమ కావని వివరించింది.
News October 20, 2025
VJA: రేపటితో ముగియనున్న గడువు.. మీ అభ్యంతరాలు తెలపండి

అమరావతి నగర అర్బన్ డిజైన్ & ఆర్కిటెక్చరల్ గైడ్‌లైన్స్ (UDAG)ను APCRDA గత నెల విడుదల చేసింది. UDAGపై అభ్యంతరాలు, సలహాలు, సూచనలు ఉంటే రేపటిలోపు తెలియజేయాలని సూచించింది. UDAG డాక్యుమెంట్ APCRDA వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని, https://crda.ap.gov.in/APCRDAV2/UserInterface/Polling_Opinion.aspxలో ప్రజలు తమ సలహాలు, సూచనలు ఇవ్వవచ్చని CRDA కమిషనర్ కె.కన్నబాబు సూచించారు.