News February 8, 2025
వికారాబాద్: జండూబామ్ రాసి కొట్టేస్తున్నారు.. జర జాగ్రత్త..!

ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలి ఆభరణాలను అపహరించిన దంపతులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు నవాబ్‌పేట్ SI అరుణ్ కుమార్ అన్నారు. SI వివరాలిలా.. మాదిరెడ్డిపల్లికి చెందిన వృద్ధురాలు రుక్కమ్మ జనవరి 29న ఇంట్లో ఒంటరిగా ఉండగా కుంటి సునీత, వెంకటేశ్ దంపతులు వృద్ధురాలి కళ్లకు జండూబాం రుద్ది మేడలో ఉన్న బంగారం దొంగలించినట్లు పేర్కొన్నారు. వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.
Similar News
News March 22, 2025
ఎర్త్ అవర్‌లో స్వచ్ఛందంగా పాల్గొనండి: CBN

AP: నేడు ఎర్త్ అవర్ సందర్భంగా గంట పాటు లైట్లను ఆపేసే కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని CM CBN పిలుపునిచ్చారు. మనందరికీ ఆవాసమైన భూమిని కాపాడుకునేందుకు కృషి చేయాలన్నారు. ఈ ఏడాది ప్రపంచ జల దినోత్సవం రోజునే ఎర్త్ అవర్ వచ్చిందన్నారు. స్వర్ణాంధ్ర 2047 విజన్‌కు నీటి భద్రత, ఇంధన ఖర్చు తగ్గించడమే కీలకమని చెప్పారు. మనం చేసే చిన్న పనులే పెద్ద మార్పునకు దారి తీస్తాయనే విషయం గుర్తుంచుకోవాలన్నారు.
News March 22, 2025
నంద్యాల జిల్లాలో దారుణ హత్య

బండిఆత్మకూరు మండలం లింగాపురంలో శనివారం దారుణ హత్య చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నంద్యాల సుధాకర్ రెడ్డి పొలం వద్దకు వెళ్తుండగా కొత్తచెరువు దగ్గర మాటువేసిన గుర్తుతెలియని దుండగులు ఆయనను అత్యంత కిరాతకంగా నరికి చంపారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు.
News March 22, 2025
ORRపై ఘోర రోడ్డుప్రమాదం.. నల్గొండ అమ్మాయి మృతి

రోడ్డుప్రమాదంలో నల్గొండకు చెందిన యువతి మృతిచెందిన ఘటన తెల్లవారుజామున జరిగింది. స్థానికుల వివరాలిలా.. HYDలో MBBS చేస్తున్న తన చెల్లిని తీసుకురావడానికి నల్గొండ నుంచి ఇద్దరు అన్నదమ్ములు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ORRపై కారు టైర్ పగలడంతో రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనా స్థలంలోనే యువతి చనిపోగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారు నల్గొండలోని మీర్ బాగ్, రహమాన్ బాగ్‌కు చెందిన వారిగా గుర్తించారు.