News February 11, 2025
వికారాబాద్ జడ్పీ పీఠంపై కీలక నేతల దృష్టి

వికారాబాద్ జడ్పీ పీఠంపై కీలక నేతలు దృష్టి సారించారు. మహిళా రిజర్వేషన్ వస్తే బుయ్యని సరళారెడ్డి, జనరల్ వస్తే బుయ్యని శ్రీనివాస్ రెడ్డి, రఘువీర్ రెడ్డి, కొండల్‌రెడ్డి, BC వస్తే రవిగౌడ్, ఉత్తమ్‌చంద్, లాల్ కృష్ణ, ST వస్తే ధారసింగ్, కిషన్‌నాయక్, SCకి అయితే ఓ కీలకనేత కూతురు భరిలో ఉండనున్నారు. CM సొంత జిల్లా కావడంతో జడ్పీ ఛైర్మన్ పదవీ ఎంపిక కీలకం కానుంది. దీనిపై మీ కామెంట్?
Similar News
News December 7, 2025
VKB: నామినేషన్ల ఉపసంహరణ .. బుజ్జగింపుల పర్వం

వికారాబాద్ జిల్లాలో గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు మెంబర్ల నామినేషన్ల ఘట్టం ముగియడంతో ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. తీవ్ర పోటీ ఉన్న స్థానాల్లో, పోలింగ్‌కు ముందే తమ అభ్యర్థులను ఉపసంహరించుకోవాలని ప్రధాన పార్టీల నాయకుల బుజ్జగింపులు మొదలయ్యాయి. మూడో విడత ఉపసంహరణ గడువు ఈ నెల 9న ఉండటంతో పోటీలో ఉన్న అభ్యర్థులు ప్రత్యర్థులను విత్ డ్రా చేయించేలా ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
News December 7, 2025
కాకాణి గోవర్ధన్ రెడ్డిపై మరో కేసు నమోదు

మాజీమంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై వెంకటాచలం పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదయింది. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు.. ఆధారాలు లేకుండా అవినీతి ఆరోపణలు చేశారంటూ టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాధాకృష్ణ నాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో ఈ పోలీస్ స్టేషన్లో పలు కేసులు కాకాణిపై ఉన్నాయి.
News December 7, 2025
GP ఎన్నికలపై “బండి” ఫోకస్

GP ఎన్నికల్లో తమ బలాన్ని నిరూపించుకోవడానికి కేంద్రమంత్రి బండి సంజయ్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. మొదటి విడత నామినేషన్లు వేసిన సర్పంచ్ అభ్యర్థులతో వర్చువల్‌గా మాట్లాడుతున్నారు. ఎన్నికల పర్యవేక్షణకు మండలానికి ఒక అబ్జర్వర్ నియమించారు. గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ నుండి ఎలాంటి సహకారమైన అందిస్తామంటూ భరోసా కల్పిస్తున్నారు. విజయావకాశాలున్న జీపీలకు కరీంనగర్ నుంచి ప్రత్యేక టీంను పంపిస్తున్నారు.


