News February 6, 2025

వికారాబాద్‌ జిల్లాలోని సఖీ కేంద్రంలో పోస్టులు

image

వికారాబాద్‌ జిల్లాలోని సఖీ కేంద్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేశారు. కంప్యూటర్ అపరేటర్, సెక్యూరిటీగార్డ్(షిప్ట్ వైస్) ఉద్యోగాలను భర్తీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రాజెక్ట్ డైరెక్టర్ తెలిపారు. పూర్తి వివరాలకు 9652807354కు సంప్రదించాలని సూచించారు. దరఖాస్తులను ఆన్‌ లైన్‌లో కూడా స్వీకరించనున్నట్లు తెలిపారు.

Similar News

News November 11, 2025

నారాయణ పేట: ఉత్తమ ఉపాధ్యాయుడికి సన్మానం

image

నారాయణపేట పట్టణంలోని మైనారిటీ సంక్షేమ గురుకుల పాఠశాలలో పీజీటీ ఉర్దూ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న అబ్దుల్ అలీం ఉమ్మడి జిల్లా మైనారిటీ గురుకులాల ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎన్నికయ్యారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆర్ఎల్‌సి ఖాజా బహుద్దీన్.. అబ్దుల్ అలీంను సన్మానించి, జ్ఞాపికను అందించారు. పాఠశాల ప్రిన్సిపాల్, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

News November 11, 2025

ఖమ్మం: వీధి కుక్కలకు వింత వ్యాధులు

image

జిల్లా వ్యాప్తంగా వీధి కుక్కలు ఒక వింత వ్యాధితో బాధపడుతున్నాయి. అన్ని మండలాల్లో కుక్కల చర్మంపై భయంకరమైన మచ్చలు ఏర్పడి దయనీయ స్థితిలో కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితి పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పశువైద్యాధికారులు వెంటనే స్పందించి, కుక్కలకు సోకిన ఈ వ్యాధిని అరికట్టడానికి తగు చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు.

News November 11, 2025

బిహార్ ఎలక్షన్స్: ALL TIME RECORD

image

బిహార్ అసెంబ్లీ ఎన్నికల చరిత్రలో ఆల్ టైమ్ రికార్డు నమోదయింది. ఫేజ్-1(65.08%), ఫేజ్-2(68.76%) కలిపి ఈసారి మొత్తం 66.91% ఓట్లు పోలయ్యాయి. 1951లో తొలి ఎలక్షన్ జరిగినప్పటి నుంచి ఆ రాష్ట్రంలో ఇదే అత్యధికం కావడం గమనార్హం. మహిళల ఓటింగ్‌లోనూ ఈసారి రికార్డు స్థాయిలో 71.6% ఓటింగ్ నమోదైంది. ఎన్నికల ఫలితాలు ఈ నెల 14న వెలువడనుండగా ఎగ్జిట్ పోల్స్ NDAకే విజయావకాశాలు ఉన్నాయని అంచనా వేశాయి..