News February 6, 2025
వికారాబాద్ జిల్లాలోని సఖీ కేంద్రంలో పోస్టులు

వికారాబాద్ జిల్లాలోని సఖీ కేంద్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేశారు. కంప్యూటర్ అపరేటర్, సెక్యూరిటీగార్డ్(షిప్ట్ వైస్) ఉద్యోగాలను భర్తీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రాజెక్ట్ డైరెక్టర్ తెలిపారు. పూర్తి వివరాలకు 9652807354కు సంప్రదించాలని సూచించారు. దరఖాస్తులను ఆన్ లైన్‌లో కూడా స్వీకరించనున్నట్లు తెలిపారు.
Similar News
News March 22, 2025
కెప్టెన్సీకి హీథర్ నైట్ రాజీనామా

ఇంగ్లండ్ మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్సీకి హీథర్ నైట్ రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ECB ధ్రువీకరించింది. 9 ఏళ్లపాటు సేవలందించినందుకు థ్యాంక్స్ అని సోషల్ మీడియాలో పోస్టు చేసింది. 2016లో కెప్టెన్‌గా ఎంపికైన హీథర్ ఏకంగా 199 మ్యాచ్(టెస్టు, వన్డే, టీ20)లకు నాయకత్వం వహించారు. ఆమె సారథ్యంలోనే ఇంగ్లండ్ 2017 వరల్డ్ కప్‌ను గెలుచుకుంది. హీథర్ 3 ఫార్మాట్లలో 7వేలకు పైగా రన్స్, 84 వికెట్లు తీశారు.
News March 22, 2025
MBNR: నీటి కోసం మూడేళ్లుగా ఉపాధ్యాయుడి పోరాటం

ఉమ్మడి జిల్లాలోని కోస్గి పట్టణానికి చెందిన ఉపాధ్యాయుడు వీరు మల్లేష్ “WALK FOR WATER’ అనే నినాదంతో ఉమ్మడి జిల్లాలోని ఉన్న పలు ప్రభుత్వ పాఠశాలలో పర్యటిస్తూ.. విద్యార్థులకు నీటి యొక్క ప్రాముఖ్యతను, నీటిని సంరక్షించుకునే విధానాన్ని వివరిస్తూ నీటి ప్రతిజ్ఞ చేయిస్తూ.. గత మూడేళ్లుగా నీరు వృధా కాకుండా ఎలా ఉపయోగించుకోవాలో ప్రజలకు వివరిస్తూనే ఉన్నారు. వరల్డ్ వాటర్ డే సందర్భంగా “Way2News” ప్రత్యేక కథనం.
News March 22, 2025
ములుగు జిల్లాకే తల మాణికం రామప్ప చెరువు!

ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని పాలంపేటలో గల కాకతీయుల కాలం నాటి రామప్ప సరస్సు జిల్లాకే తలమానికం అని చెప్పవచ్చు. సుమారు 6000 ఎకరాల్లో పంటలకు సాగునీరు నందిస్తూ, నాలుగు మండలాలకు తాగునీరును అందించడమే కాక ఈ సరస్సులోని నీటిని గణపసముద్రం, పాకాల సరస్సులకు తరలిస్తున్నారు. రామప్ప సరస్సును రిజర్వాయర్‌గా మార్చడానికి ప్రభుత్వం ప్రణాళికలు చేస్తున్నది. (నేడు ప్రపంచ జల దినోత్సవం)