News April 8, 2025
వికారాబాద్: జిల్లాలో ఇన్కమ్ టాక్స్ దాడులు

జిల్లా పరిధిలోని ఛన్గోముల్ గ్రామంలో సోమవారం ఇన్కమ్ టాక్స్ అధికారి విట్టల్ రావు బృందం దాడులు నిర్వహించింది. గ్రామానికి చెందిన బేగారి ప్రభాకర్ ఇంటిని వరంగల్కు చెందిన పండాల రవళి అద్దెకు తీసుకొని, వ్యాపారం చేస్తున్నట్లు చూపుతూ ఫోర్జరీ సంతకాలు సృష్టించినట్లు ఆరోపణలు వచ్చాయి. అధికారులు వివరాలు సేకరించినట్లు కార్యదర్శి పరుశురాం తెలిపారు.
Similar News
News April 19, 2025
ఆ బాధను అబ్బాయిలు భరించలేరు: జాన్వీ కపూర్

మహిళలకు పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పిని అబ్బాయిలు క్షణం కూడా భరించలేరని స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ అన్నారు. కానీ కొంతమంది పురుషులు ఈ నొప్పిని చులకనగా చూస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. నెలసరి సమయంలో మహిళలు మానసిక క్షోభ అనుభవిస్తారని చెప్పారు. అలాంటి సమయంలో వారు ఓదార్పు కోరుకుంటారని తెలిపారు. కాగా జాన్వీ ప్రస్తుతం తెలుగులో రామ్ చరణ్ సరసన ‘పెద్ది’ మూవీలో నటిస్తున్నారు.
News April 19, 2025
ఏప్రిల్ 22న ఇంటర్ ఫలితాలు

TG: ఇంటర్ ఫలితాలను ఏప్రిల్ 22న విడుదల చేయనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆ రోజున ఫలితాలను వెల్లడించనున్నారు. మార్చి 5 నుంచి 25 వరకు పరీక్షలు జరిగాయి. Way2Newsలో వేగంగా, సులభంగా రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. కాగా ఏపీ ఇంటర్ ఫలితాలు ఈనెల 12న విడుదలైన సంగతి తెలిసిందే.
News April 19, 2025
సౌదీలో పర్యటించనున్న మోదీ

ప్రధాని మోదీ సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లనున్నారు. క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ ఆహ్వానం మేరకు ఏప్రిల్ 22, 23 తేదీల్లో సౌదీలో పర్యటిస్తారు. 2016, 2019 తర్వాత మూడోసారి నరేంద్ర మోదీ గల్ఫ్ దేశంలో పర్యటించనున్నారు. 2023 సెప్టెంబర్లో G20 సమ్మిట్, సౌదీ-భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య తొలి సమావేశంలో పాల్గొనేందుకు సౌదీ యువరాజు ఇండియా వచ్చిన విషయం తెలిసిందే.