News March 13, 2025

వికారాబాద్ జిల్లాలో ఏడుగురికి జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలు 

image

జూనియర్ లెక్చరర్లుగా ఎంపికైన వారికి రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలను అందజేశారు. అందులో భాగంగా వికారాబాద్ జిల్లాలో ఏడుగురికి జూనియర్ లెక్చరర్లగా ఉద్యోగాలు వచ్చాయి. అందులో జిల్లాకు చెందిన హరిత రాణి, పద్మజ, సానియా సుల్తానా, భార్గవి, రాజు నాయక్, కమల్ రాజ్, అనంతయ్య ఉన్నారు.  

Similar News

News March 20, 2025

మెదక్: నో హెల్మెట్.. NO ENTRY: కలెక్టర్

image

మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లోని అన్ని మండలాల ఎమ్మార్వోలతో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఆయా మండలాలలోని ఎమ్మార్వో కార్యాలయంలోకి వచ్చే ప్రతి ఒక్క వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి రావాలని సూచించారు. అదే విధంగా అన్ని ఎమ్మార్వో కార్యాలయాల్లో ప్లాస్టిక్ నిషేధించాలన్నారు.

News March 20, 2025

KMR: రాష్ట్రస్థాయి పోటీలకు 18 మంది

image

కామారెడ్డి జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం ఇందిరాగాంధీ స్టేడియంలో జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించారు. అండర్ 14, 16, 18, 20 విభాగాల్లో వివిధ అంశాల్లో మెన్, ఉమెన్ సెలెక్షన్స్ నిర్వహించగా.. 18 మంది ఉత్తమ ప్రతిభ కనబరిచారు. వీరందరూ.. ఈ నెల 23న గార్డియం స్టేడియం కొల్లూరు, HYDలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని అసోసియేషన్ కార్యదర్శి అనిల్ తెలిపారు.

News March 20, 2025

భైoసా: ఆల్ ఇండియా పోటీలకు తపాలా ఉద్యోగులు

image

ఓ వైపు విధులు నిర్వర్తిస్తూనే క్రీడల్లో సత్తాచాటి జాతీయస్థాయికి ఎంపికయ్యారు జిల్లాకు చెందిన తపాలా ఉద్యోగులు వినోద్ కుమార్, నరేశ్‌కుమార్. HYDలో జరిగిన జాతీయస్థాయి ఖోఖో పోటీల్లో ప్రతిభ కనబర్చి అల్ ఇండియా సివిల్ సర్వీసెస్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 21 నుంచి 24 వరకు ఢిల్లీలో జరిగే పోటీల్లో వీరు RSB HYD జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు. అక్కడ కూడా ప్రతిభ చాటాలంటే ఆల్ ది బెస్ట్ చెప్పేయండి మరి. 

error: Content is protected !!