News February 14, 2025
వికారాబాద్ జిల్లాలో నకిలీ నోట్ల కలకలం

డిజిటల్ రూపంలో చెల్లింపులు చేపడుతున్నప్పటికీ అవసర నిమిత్తం క్యాష్ ఉపయోగిస్తూ జనాలు తమ అవసరాలను తీర్చుకుంటున్నారు. ఇదే అదునుగా చూసి కొంత మంది నకిలీ నోట్లు ముద్రించి మార్కెట్లో చలామణి చేస్తున్నారు. వ్యాపారం చేస్తున్న వారిలో కొద్దిగా వయసు పైబడిన వారు దొంగ నోట్లను గుర్తించడం కష్టతరం కావడంతో దొంగ నోట్ల ముఠా వారినే టార్గెట్ చేస్తున్నారు. ఇలాంటి పలు ఘటనలు మర్పల్లిలో వెలుగు చూశాయి.
Similar News
News December 4, 2025
సర్పంచ్.. ప్రజాస్వామ్యానికే ‘పంచ్’!

TG: సర్పంచ్ ఎన్నికల వేళ కొందరు ప్రజాస్వామ్యానికే సవాల్ విసురుతున్నారు. ఎలక్షన్ ప్రక్రియ మొదలైన నాటి నుంచి నిత్యం ఎక్కడో ఒకచోట సర్పంచ్ పదవులకు వేలంపాటలు జరుగుతూనే ఉన్నాయి. ఓటర్లతో పనిలేదు.. డబ్బు ఉన్నోడిదే రాజ్యం అనేలా మారిపోయింది పరిస్థితి. పైసా లేకున్నా నిజాయతీగా ఎన్నికల్లో పోటీ చేద్దామనుకునేవాడికి నిరాశే ఎదురవుతోంది. కఠిన చట్టాలతోనే వేలం పాటలకు అడ్డుకట్ట పడుతుందని ఓటర్లు అంటున్నారు.
News December 4, 2025
కలెక్టరేట్లో ప్రతిష్టాపనకు సిద్ధంగా తెలంగాణ తల్లి విగ్రహం: ఖమ్మం కలెక్టర్

ఖమ్మం కలెక్టరేట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహం ప్రారంభోత్సవానికి సిద్ధమయ్యిందని, విగ్రహ ప్రతిష్టాపన పనులు చివరి దశకు చేరాయని కలెక్టర్ అనుదీప్ అన్నారు. కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేస్తున్న తెలంగాణ తల్లి విగ్రహం నిర్మాణ పనులను కలెక్టర్ గురువారం పరిశీలించారు. కలెక్టరేట్‌కు మరింత ఆకర్షణ వచ్చే విధంగా విగ్రహ ఏర్పాటు ఉండాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
News December 4, 2025
ఏపీకి జల్‌శక్తి మంత్రిత్వ శాఖ నోటీసులు

తెలంగాణ ప్రభుత్వం చేసిన ఫిర్యాదు మేరకు పోలవరం-నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్ట్‌పై కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. వారంలోపు ప్రాజెక్టు వాస్తవ స్థితిపై సమాధానం ఇవ్వాలని పేర్కొంది. పోలవరం-నల్లమల సాగర్ డీపీఆర్ కోసం టెండర్లు పిలవడాన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే.


