News January 31, 2025
వికారాబాద్: జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

✓ వికారాబాద్: వాహనాల ట్యాక్స్ చెల్లింపులకు నేడు చివరి తేదీ✓ లగచర్లలో నేటి భూ సర్వే వాయిదా✓ తాండూరులో నేడు ఇండోర్ స్టేడియాన్ని ప్రారంభించనున్న ఎమ్మెల్యే✓ రైతు భరోసా దరఖాస్తుకు నేడు చివరి తేదీ✓ తాండూర్లో నేడు కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ✓ వికారాబాద్లో అభివృద్ధి పనులకు నేడు స్పీకర్ శంకుస్థాపన✓యాలాల్లో అభివృద్ధి పనులను ప్రారంభించనున్న ఎమ్మెల్యే
Similar News
News October 20, 2025
పండుగ పూట విషాదం.. అయిజ రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

అయిజ-గద్వాల రోడ్డులో బింగిదొడ్డి సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అయిజ మాలపేటకు చెందిన వీరేష్ మృతి చెందాడు. బైక్పై వెళ్తున్న వీరేష్ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు. ఒక ప్రైవేట్ స్కూల్ బస్సు డ్రైవర్గా పనిచేసే వీరేష్ మృతితో అయిజలో పండుగపూట విషాదం నెలకొంది.
News October 20, 2025
దీపావళి వేడుకల్లో సీఎం దంపతులు

AP: సీఎం చంద్రబాబు దంపతులు దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఉండవల్లిలోని నివాసంలో సతీమణి భువనేశ్వరితో కలిసి ఇంట్లో పూజ నిర్వహించారు. అనంతరం వారిద్దరూ కలిసి బాణసంచా కాల్చారు. దీపావళి వెలుగులు శాశ్వతం అవ్వాలని.. ప్రజలకు ప్రతిరోజు పండుగ కావాలని దేవుడిని ప్రార్థించానని చంద్రబాబు ట్వీట్ చేశారు.
News October 20, 2025
BREAKING: బాసరలో విషాదం.. కాలు తెగిపోయింది..!

నిర్మల్ జిల్లా బాసర మండలం టాక్లి గ్రామంలో పండుగ పూట విషాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన రైతు శివ ఎప్పటిలాగే తన వ్యవసాయ పొలంలో ట్రాక్టర్ రోటవేటర్తో పనులు చేస్తున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు అందులో అతడి కాలు ఇరుక్కొని తెగిపోయింది. స్థానికులు గమనించి శివను బయటకు తీసి, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారొచ్చి అతడిని ఆస్పత్రికి తరలించారు.