News February 20, 2025
వికారాబాద్ జిల్లాలో నేటి కార్యక్రమాలు

✓ దుద్యాల: నేటి నుంచి పోలేపల్లి ఎల్లమ్మ బ్రహ్మోత్సవాలు ప్రారంభం.✓ వికారాబాద్: నేటి నుండి స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం.✓ వికారాబాద్: నేటితో బియ్యం పంపిణీ గడువు.✓ పరిగి, పెద్దేముల్ మండలాల్లో నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం.✓ నేడు ఆయా నియోజకవర్గాల్లో పర్యటించనున్న ఎమ్మెల్యేలు.✓ నేడు ఆయా ప్రాంతాల నుండి శివ స్వాముల పాదయాత్ర.
Similar News
News March 27, 2025
విశాఖ: ప్రేమ పేరుతో గాలం.. గర్భం దాల్చిన బాలిక..!

విశాఖలో 9వ తరగతి చదువుతున్న బాలికను సీతయ్య అనే వ్యక్తి మాయమాటలు చెప్పి గర్భవతిని చేశాడు. ఈ ఘటనపై MVP పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివాహితుడైన సీతయ్య.. తల్లి,అన్నయ్యతో కలిసి ఉంటున్న బాలిక(14)కు ప్రేమ పేరుతో గాలం వేశాడు. ఆమెపై పలుమార్లు లెంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక ప్రవర్తనలో మార్పు రావడంతో ఆసుపత్రిలో పరీక్షలు చేయించగా గర్భవతని తేలింది. దీంతో సీతయ్యపై ఫిర్యాదు చేశారు.
News March 27, 2025
మెదక్: ఉరివేసుకొని యువకుడు ఆత్మహత్య

యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మనోహరాబాద్ మండలంలో గురువారం జరిగింది. స్థానికుల వివరాలు.. బిహార్‌లోని బాక్సర్ జిల్లా, సిమారికి చెందిన కమలేష్ కుటుంబంతో కలిసి కాళ్లకల్‌లో నివసిస్తున్నాడు. ఇతనికి భార్య మమత ఇద్దరు పిల్లలు కలరు. వెల్డింగ్ వర్క్ చేసుకుంటా జీవనం కొనసాగించేవాడు. ఆర్థిక ఇబ్బందులతో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలిసిన పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.
News March 27, 2025
సంపాదనలో రష్మిక మందన్న టాప్

నేషనల్ క్రష్ రష్మిక మందన్న రూ.70 కోట్ల ఆస్తులు సంపాదించినట్లు ఫోర్బ్స్ సంస్థ తెలిపింది. త్వరలోనే ఇది రూ.100 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. ఆమెకు హైదరాబాద్, బెంగళూరు, కూర్గ్, ముంబై, గోవాలో సొంత ఇళ్లు ఉన్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఆమె ఒక్కో సినిమాకు రూ.10 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని వెల్లడించాయి. దక్షిణాదిలో సంపాదనపరంగా రష్మికనే నంబర్‌వన్ అని చెప్పాయి.