News February 20, 2025

వికారాబాద్ జిల్లాలో నేటి కార్యక్రమాలు

image

✓ దుద్యాల: నేటి నుంచి పోలేపల్లి ఎల్లమ్మ బ్రహ్మోత్సవాలు ప్రారంభం.✓ వికారాబాద్: నేటి నుంచి స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం.✓ వికారాబాద్: నేటితో బియ్యం పంపిణీ గడువు ముగింపు.✓ పరిగి, పెద్దేముల్ మండలాల్లో నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం.✓ నేడు ఆయా నియోజకవర్గాల్లో పర్యటించనున్న ఎమ్మెల్యేలు.✓ నేడు ఆయా ప్రాంతాల నుంచి శివ స్వాముల పాదయాత్ర.

Similar News

News November 19, 2025

తిరుపతి రైతులకు నేడు నగదు జమ

image

తిరుపతి జిల్లా రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత నగదు ఇవాళ విడుదల కానుంది. జిల్లాలోని 1,54, 908 మంది రైతులకు రూ.104 కోట్లు బుధవారం జమ చేయనున్నారు. కడప జిల్లా నుంచి సీఎం చంద్రబాబు నగదు విడుదల చేస్తారు. తిరుపతి జిల్లాలో ప్రస్తుతం వరినాట్లు మొదలయ్యాయి. వీరికి ఈ నగదు ఎంతగానో ఉపయోగపడనుంది.

News November 19, 2025

నిజామాబాద్: 23 మందికి రూ.2.36 లక్షల జరిమానా

image

నిజామాబాద్‌ డివిజన్ పరిధిలో మద్యం తాగి వాహనాలు నడిపిన 30 మందిని పోలీసులు పట్టుకున్నారు. వారిని మంగళవారం జిల్లా మార్నింగ్ కోర్టులో సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ నూర్జహాన్ ఎదుట హాజరుపరిచారు. వారిలో 23 మందికి రూ.2.36 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు నిచ్చింది. మరో ఏడుగురికి జైలు శిక్ష పడింది. అంతకు ముందు వారికి సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులు కౌన్సెలింగ్ ఇచ్చారు.

News November 19, 2025

కొత్తగూడెం: సివిల్స్ అభ్యర్థులకు రూ.లక్ష ప్రోత్సాహకం

image

రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకం కింద సివిల్స్ ఇంటర్వ్యూలకు ఎంపికైన అర్హులైన అభ్యర్థులందరూ రూ.లక్ష ప్రోత్సాహకం కోసం దరఖాస్తు చేసుకోవాలని సింగరేణి సీఎండీ ఎన్.బలరాం నాయక్ తెలిపారు. గతంలో మెయిన్స్‌కు ఎంపికై రూ.లక్ష ప్రోత్సాహకం పొందిన అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.