News February 28, 2025

వికారాబాద్ జిల్లాలో నేటి కార్యక్రమాలు

image

✓ వికారాబాద్: నేడు క్యాంపు కార్యాలయంలో అందుబాటులో ఉండనున్న స్పీకర్.✓ పరిగి: నేడు కంకల్ వీరభద్రేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే.✓ తాండూరు: నేడు జీవన్గి గ్రామంలో కుస్తీల పోటీలు.✓ కొడంగల్: నేటి నుండి అడవిలా మైసమ్మ ఉత్సవాలు ప్రారంభం.✓ బంట్వారం: నేడు మేకల సంతలో అన్నదానం.✓ కుల్కచర్ల: నేడు పిఎసిఎస్ సర్వసభ్య సమావేశం.✓ తట్టేపల్లి: నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం.

Similar News

News December 9, 2025

సోనియా గాంధీకి కోర్టు నోటీసులు

image

కాంగ్రెస్ నేత సోనియా గాంధీకి ఢిల్లీ కోర్టు నోటీసులిచ్చింది. 1983 ఏప్రిల్‌లో ఇండియన్ సిటిజన్‌షిప్ రావడానికి మూడేళ్ల ముందే ఎలక్టోరల్ రోల్‌లో పేరు నమోదైనట్టు ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. 2026, జనవరి 6వ తేదీన ఈ పిటిషన్‌పై మరోసారి విచారణ జరుపుతామని స్పెషల్ జడ్జి జస్టిస్ విశాల్ గోనె తెలిపారు. ఢిల్లీ పోలీసులకు కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది.

News December 9, 2025

సూర్యాపేటలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ

image

సూర్యాపేట సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ ప్రాంగణంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మంగళవారం తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, మెప్మా మహిళలు, ఆశా వర్కర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. విగ్రహానికి పూలమాలలు సమర్పించిన అనంతరం అందరూ సమూహంగా “జయ జయహే తెలంగాణ” గీతాన్ని ఆలపించారు.

News December 9, 2025

బాపట్లలో యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

image

బాపట్లలో మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. పట్టణంలోని చీలు రోడ్డు వద్ద లారీ, ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న శివరామకృష్ణ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.