News March 1, 2025
వికారాబాద్ జిల్లాలో నేటి కార్యక్రమాలు

✓ కొడంగల్:నేడు ఎంఐఎం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.✓ తాండూర్:నేడు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో సమావేశం.✓ కొడంగల్:నేటి నుండి సంగాయిపల్లి నుంచి స్వామి జాతర.✓ పూడూరు:నేడు కంకల్ వీరభద్రేశ్వర స్వామి ఆలయంలో శివపార్వతుల కళ్యాణం.✓ దుద్యాల్:నేడు కుదురుమల్ల ZPHS పాఠశాల వార్షికోత్సవం.✓ కోట్పల్లి:నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం.✓కోట్పల్లి:నేడు మార్కండేయ ఆలయ వార్షికోత్సవం.✓ నేడు ఎమ్మెల్యేల పర్యటనలు.
Similar News
News March 23, 2025
అమెరికాలో మెడికల్ సీటు సాధించిన ఖమ్మం విద్యార్థి

ఖమ్మం నగరానికి చెందిన రాజావాసిరెడ్డి-నేహాశివాని అమెరికాలోని ప్రతిష్టాత్మక వెస్ట్ వర్జీనియా విశ్వవిద్యాలయంలో ఎండీ జనరల్ మెడిసిన్ విభాగంలో పీజీ సీటు సాధించారు. ఇటీవల విడుదల చేసిన ఫలితాలలో ఆమె ప్రతిభ చాటారు. వివిధ దశలలో నిర్వహించే మెడికల్ లైసెన్సింగ్ ప్రవేశ పరీక్షలు, ఇంటర్వ్యూలో అత్యుత్తమ ప్రతిభను కనబరచి మొదటి ప్రయత్నంలోనే సీటు సాధించడం విశేషం. ఆమె నెలకు రూ.6వేల డాలర్ల పారితోషకం అందుకోనున్నారు.
News March 23, 2025
మే 7న ఏపీ ఐసెట్

AP: MBA, MCA కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఐసెట్ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు కన్వీనర్ ఎం.శశి తెలిపారు. ఏప్రిల్ 9 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఏప్రిల్ 14 వరకు ₹1000, 15 నుంచి 19 వరకు ₹2వేలు, 20 నుంచి 24 వరకు ₹4వేలు, 25 నుంచి 28వ తేదీ వరకు ₹10వేల లేట్ ఫీజుతో అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పించారు. మే 7న పరీక్ష నిర్వహిస్తారు.
వెబ్ సైట్: https://cets.apsche.ap.gov.in/
News March 23, 2025
IPLలో నేడు డబుల్ ధమాకా

ఐపీఎల్-2025లో ఇవాళ రెండు మ్యాచులు జరగనున్నాయి. మ.3.30 గంటలకు హైదరాబాద్ వేదికగా SRH, RR తలపడనున్నాయి. రా.7.30 గంటలకు ఛాంపియన్ టీమ్స్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య చెన్నై వేదికగా మ్యాచ్ జరగనుంది. స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం వీక్షించవచ్చు. ఈరోజు ఏయే జట్లు గెలుస్తాయని అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.