News March 17, 2025
వికారాబాద్ జిల్లాలో నేటి నుంచి సర్వే!

వికారాబాద్ జిల్లాలో నేటి నుంచి కుష్టు వ్యాధికి సంబంధించి సర్వే చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో 720 మంది ఆశావర్కర్లతో ఈనెల 31వ తేదీ వరకు సర్వే చేయనున్నట్లు జిల్లా లెప్రసీ నిర్మూలన అధికారి డాక్టర్ రవీందర్ యాదవ్ తెలిపారు. ప్రతి ఆశాకార్యకర్త రోజుకు 25 ఇళ్లను సందర్శించి సర్వే చేయనున్నారు. కుష్టు వ్యాధికి సంబంధించిన లక్షణాలు ఉంటే తెలియజేయాలని అధికారులు సూచించారు.SHARE IT
Similar News
News December 8, 2025
ఆదిలాబాద్: ఎన్నికల బరిలో వింత పోకడలు

పంచాయతీ ఎన్నికల్లో భిన్న పరిస్థితులు నెలకొంటున్నాయి. తాము సర్పంచిగా గెలవాలని అభ్యర్థులు వివిధ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికీ రెండో విడత నామినేషన్ల ఉపసంహరణ పూర్తయింది. అభ్యర్థులు తమకు పోటీగా ఉన్న వారికి వేరేరకంగా మేలు చేస్తామని ఒప్పించి నామినేషన్లు ఉపసంహరించుకునేలా చేశారు. 3వ విడతలోనూ నామినేషన్ల ఉపసంహరణ జరిగే అవకాశాలున్నాయి. ఖర్చులు ఇస్తామని, అవకాశాలు కల్పిస్తామని హామీ ఇవ్వడంతో వెనక్కి తగ్గారు.
News December 8, 2025
‘హమాస్’పై ఇండియాకు ఇజ్రాయెల్ కీలక విజ్ఞప్తి

‘హమాస్’ను ఉగ్ర సంస్థగా ప్రకటించాలని భారత్‌ను ఇజ్రాయెల్ కోరింది. పాక్‌కు చెందిన లష్కరే తోయిబా, ఇరాన్ సంస్థలతో దీనికి సంబంధాలున్నాయని చెప్పింది. గాజాలో కార్యకలాపాల పునరుద్ధరణకు ప్రయత్నిస్తోందని, ప్రపంచవ్యాప్తంగా దాడులకు అంతర్జాతీయ సంస్థలను వాడుకుంటోందని తెలిపింది. హమాస్ వల్ల ఇండియా, ఇజ్రాయెల్‌కు ముప్పు అని పేర్కొంది. ఇప్పటికే US, బ్రిటన్, కెనడా తదితర దేశాలు హమాస్‌ను టెర్రర్ సంస్థగా ప్రకటించాయి.
News December 8, 2025
NLG: మాటల తూటాలు.. స్నేహ బంధాలు!

జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా ఆయా పార్టీలు వైరం మరిచి ఒకరికొకరు సహకరించుకుంటున్నాయి. చాలా చోట్ల బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తుండగా.. మరికొన్ని చోట్ల సీపీఎం, బీజేపీ, ఇంకొన్ని చోట్ల బీజేపీ, కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నాయి. నిన్నటి వరకు ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చిన నేతలు ఇప్పుడు స్నేహబంధం చాటుతూ.. కలిసి ఓట్లు అడుగుతుండటంతో ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.


