News March 17, 2025
వికారాబాద్ జిల్లాలో నేటి నుంచి సర్వే!

వికారాబాద్ జిల్లాలో నేటి నుంచి కుష్టు వ్యాధికి సంబంధించి సర్వే చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో 720 మంది ఆశావర్కర్లతో ఈనెల 31వ తేదీ వరకు సర్వే చేయనున్నట్లు జిల్లా లెప్రసీ నిర్మూలన అధికారి డాక్టర్ రవీందర్ యాదవ్ తెలిపారు. ప్రతి ఆశాకార్యకర్త రోజుకు 25 ఇళ్లను సందర్శించి సర్వే చేయనున్నారు. కుష్టు వ్యాధికి సంబంధించిన లక్షణాలు ఉంటే తెలియజేయాలని అధికారులు సూచించారు.SHARE IT
Similar News
News April 21, 2025
భార్య కనిపించడం లేదని పోలీస్ కంప్లైంట్.. కట్ చేస్తే..

UPలోని అలీగఢ్‌కు చెందిన షకీర్(40) అనే వ్యక్తి తన భార్య అంజుమ్, నలుగురు పిల్లలు ఈ నెల 15 నుంచి కనిపించడం లేదంటూ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులకూ వారి ఆచూకీ లభించలేదు. తాజాగా షకీర్ బంధువులకు ఆమె తాజ్‌మహల్ వద్ద మరో వ్యక్తితో కలిసి కనిపించింది. వారు వాట్సాప్‌లో వీడియో పంపించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వ్యక్తి తెలిసినవాడేనని, తన భార్యను తన వద్దకు చేర్చాలని షకీర్ అధికారుల్ని కోరాడు.
News April 21, 2025
IPL: ముంబై సునాయాస విజయం

చెన్నై చాలా కష్టంగా చేసిన 176 పరుగుల లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ ఉఫ్‌మని ఊదేసింది. రోహిత్ హాఫ్ సెంచరీ(76*)తో ఫామ్‌లోకి రాగా అటు సూర్య కూడా తనదైన శైలిలో అర్ధ శతకం(68*) చేయడంతో 16వ ఓవర్లోనే MI టార్గెట్‌ను ఛేదించింది. చెన్నై బౌలర్లలో జడేజాకు మాత్రమే వికెట్ దక్కింది. ఈ ఓటమితో చెన్నై ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి.
News April 21, 2025
తమ్ముడి వివాహ నిశ్చయం కోసం వెళ్తూ..

ఉరవకొండలో ఆదివారం విషాద ఘటన జరిగింది. తమ్ముడి వివాహ నిశ్చయానికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో అక్క మృతి చెందింది. పట్టణానికి చెందిన ప్రవల్లిక తన తమ్ముడి వివాహ నిశ్చయం కోసం భర్త మల్లికార్జునతో కలిసి బైక్‌పై వజ్రకరూరు మండలం ఛాయాపురం గ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలో పట్టణ శివారులోని కళ్యాణ మండపం వద్ద ఆటో ఢీకొంది. ప్రవల్లిక అక్కడికక్కడే మృతి చెందగా భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించారు.