News March 9, 2025
వికారాబాద్ జిల్లాలో బగ్గుమంటున్న భానుడు

వికారాబాద్ జిల్లాలో భానుడు భగ్గుమంటున్నాడు. మార్చి మొదటి వారంలోనే ఎండలు దంచి కొడుతున్నాయి. ఉదయం 10 గంటలు దాటితే చాలు ఇంటి నుంచి బయటికి రాలేని పరిస్థితి ఏర్పడింది. మార్చి నెలలోనే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు జిల్లాలోని తొర్మామిడిలో అత్యధికంగా 38° ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఎండల తీవ్రతతో మధ్యాహ్నం సమయంలో రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి.
Similar News
News December 6, 2025
KMR: బరిలో ఉండేదేవరో.. జారుకునేది ఎవరో..!

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 2వ విడత నామినేషన్ల ఉపసంహరణకు గడువు శనివారంతో ముగియనుంది. పలు మండలాల్లో వార్డు, సర్పంచి స్థానాలకు నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రధాన పార్టీల మద్దతుదారులతో పాటు రెబల్స్, స్వతంత్ర అభ్యర్థులు బరిలో దిగారు. అసలు సిసలైన పోటీ ఎవరెవరి మధ్య ఉండబోతోందన్నది శనివారం సాయంత్రానికి తేటతెల్లం కానుంది. బరిలో నిలిచేది ఎవరో, తప్పుకునేది ఎవరో తెలియాలంటే శనివారం వరకు వేచి చూడాల్సిందే!
News December 6, 2025
నిర్మల్: తొలి విడతలో 16 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తొలి విడత ఎలక్షన్స్ జరగనున్న ఆరు మండలాల్లో మొత్తం 16 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు. మామడ 5, ఖానాపూర్ 5, పెంబి 4, దస్తురాబాద్, లక్ష్మణచందా మండలాల్లో 1 చొప్పున సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. కడెంలో ఒక్క సర్పంచ్ స్థానం కూడా ఏకగ్రీవం కాలేదు.
News December 6, 2025
డిసెంబర్ 6: చరిత్రలో ఈ రోజు

1935: సినీ నటి సావిత్రి జననం
1985: భారత క్రికెటర్ ఆర్.పి.సింగ్ జననం
1988: భారత క్రికెటర్ రవీంద్ర జడేజా జననం
1993: భారత క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రా జననం
1991: భారత క్రికెటర్ కరుణ్ నాయర్ జననం
1994: భారత క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ జననం
1956: భారత రాజ్యాంగ నిర్మాత బి.ఆర్.అంబేడ్కర్ మరణం


