News February 14, 2025

వికారాబాద్ జిల్లాలో మండుతున్న ఎండలు

image

వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. వికారాబాద్‌లో ఇవాళ 32 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం చలి, మద్యాహ్నం ఎండతో ప్రజలు బయటికి రావడానికి జంపుతున్నారు. ఇవాళ వికారాబాద్‌లోని హైదరాబాద్ రోడ్డు నిర్మాణష్యంగా మారింది. ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో అని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎండల నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు.

Similar News

News December 10, 2025

APPLY NOW: భారీగా టీచర్ పోస్టులు

image

కేంద్రీయ విద్యాలయాలు, జవహర్ నవోదయాల్లో 14,967 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. అసిస్టెంట్ కమిషనర్, ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, టీచర్లు, లైబ్రేరియన్ వంటి పోస్టులు ఉన్నాయి. టైర్ 1, టైర్ 2, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ( ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్), సర్టిఫికెట్ల వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.

News December 10, 2025

VZM: యువతి హత్య.. 24గంటల్లో నిందితుడి అరెస్ట్

image

పెందుర్తి పీఎస్ పరిధిలోని సుజాతనగర్లో యువతితో సహజీవనం చేస్తూ తగాదా పడి కుర్చీతో <<18498127>>కొట్టి చంపి పరారైన వ్యక్తిని<<>> పోలీసులు గాలించి 24 గంటల్లోనే అరెస్టు చేశారు. శ్రీకాకుళానికి చెందిన దేవి, విజయనగరానికి చెందిన శ్రీనివాస్ 6 నెలలుగా సుజాతనగర్లో రూమ్ తీసుకుని సహజీవనం చేస్తున్నారు. డబ్బుల కోసం దేవీతో గొడవపడి చంపాడు. కాగా రైస్ పుల్లింగ్ వంటి పలు నేరాల్లో శ్రీనివాస్‌పై ఇప్పటికే కేసులున్నాయి.

News December 10, 2025

ఖమ్మంలో కాంగ్రెస్‌కు ఏకగ్రీవాల జోరు

image

స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మూడో విడత నామినేషన్ల ఉపసంహరణ అనంతరం ఖమ్మం జిల్లాలో మొత్తం 21 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో కాంగ్రెస్ ఏకంగా 19 పంచాయతీలను దక్కించుకుంది. ముఖ్యంగా, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్వగ్రామం నారాయణపురం కూడా కాంగ్రెస్ అభ్యర్థి గొల్లమందల వెంకటేశ్వర్లు ఖాతాలో చేరింది. ఇప్పటివరకు మూడు విడతల్లో కాంగ్రెస్ మొత్తం 56 ఏకగ్రీవాలతో ముందంజలో ఉంది.