News September 23, 2024
వికారాబాద్: జిల్లాలో ముఖ్యంశాలు!
✒VKBD: SAVE దామగుండం ఉద్యమంలో ప్రొ.నాగేశ్వరరావు, విమలక్క
✒మహమ్మదాబాద్: రిపోర్టర్‌పై స్కూల్ యాజమాన్యం చిందులు
✒వికారాబాద్: శివరాంనగర్‌లో చైన్ స్నాచింగ్
✒ పలుచోట్ల భారీ వర్షాలు
✒ఎంపీ విశ్వేశ్వర్ తీరు బాధ్యతారాహిత్యం: AIKMS
✒దామగుండం: Way2Newsతో పరిగి మాజీ ఎమ్మెల్యే మహేశ్ రెడ్డి
✒ VKBకు KTRను తీసుకొస్తాం: BRS
✒ఘనంగా తాండూరు నూతన రజక కార్యవర్గ ప్రమాణ స్వీకారం
Similar News
News October 7, 2024
రేపు GHMC ఆఫీస్‌లో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపు
జీహెచ్ఎంసీ ఉద్యోగులు, కార్మికుల కోసం మంగళవారం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు కమిషనర్ ఆమ్రపాలి ఒక ప్రకటనలో తెలిపారు. కిమ్స్, సైన్లైన్ హాస్పిటల్ సహకారంతో డాక్టర్ విమలాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి సర్కిల్, జోనల్ అధికారులతో పాటు ఆయా విభాగాల హెచ్ఓడీలు, సిబ్బంది సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News October 7, 2024
సికింద్రాబాద్: FAKE టిక్కెట్లు అమ్ముతున్నారు.. జర జాగ్రత్త..!
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో ఆపరేషన్ ఉపలబ్ద్‌లో భాగంగా రైల్వే ప్రొటెక్షన్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుంగా రైల్వే ఫేక్ టికెట్లను విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతడి నుంచి రూ.567 విలువ చేసే లైవ్ టికెట్, రూ.8,409 విలువ చేసే ఇతర టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ టికెట్లు ఆల్రెడీ ఉపయోగించినట్లు గుర్తించారు. స్టేషన్‌కు వచ్చే ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలన్నారు. SHARE IT
News October 7, 2024
HYD: బీసీ కులగణనకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: గోపిశెట్టి
తెలంగాణలో బీసీ కులగణన చేపట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ గోపిశెట్టి నిరంజన్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర మున్నూరుకాపు మహాసభ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి కాచిగూడ మున్నూరుకాపు భవన్‌లో నిర్వహించిన బతుకమ్మ వేడుకలను ఆయన ప్రారంభించారు. జెల్లి సిద్ధయ్య, మణికొండ వెంకటేశ్వరరావు, మంగళారపు లక్ష్మణ్, ఆత్మకూరి ప్రీతి, పొన్న సునీత పాల్గొన్నారు.