News January 28, 2025
వికారాబాద్ జిల్లా ఉత్తమ ఎంపీడీవోగా మహేశ్ బాబు

వికారాబాద్ జిల్లా ఉత్తమ ఎంపీడీవోగా దోమ మండలం ఎంపీడీవోగా విధులు నిర్వహిస్తున్న మహేశ్ బాబుకు ఉత్తమ అవార్డు లభించింది. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్ చేతుల మీదగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. అంకితభావంతో విధులు నిర్వహించడం, సేవా దృక్పథం, ఉద్యోగుల సహకారం వల్లే తనకు అవార్డు లభించిందని అన్నారు. అవార్డు మరింత బాధ్యత పెంచిందని తెలిపారు.
Similar News
News March 15, 2025
VKB: అలర్ట్.. పిల్లలపై కన్నేసి ఉంచండి

వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా వేసవి తాపం నేపథ్యంలో నేటి నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు తరగతులు ఉంటాయి. ఒంటిపూట బడులు అంటే పిల్లలకు సరదా.. చెరువుల్లో, నీటి వనరుల వద్దకు వెళ్తుంటారు. చిన్నారులు నీట మునిగి మృత్యువాత పడిన ఘటనలు ఎన్నో జరిగాయి. చెరువులు, కుంటలు, బావులు నీటితో నిండి ఉన్నాయి. పిల్లల మీద పెద్దలు ఓ కన్నేసి ఉంచండి. SHARE IT..
News March 15, 2025
యాదాద్రి: ఆర్టీసీ బస్సు ఢీ.. వ్యక్తికి తీవ్రగాయాలు

యాదాద్రి జిల్లా ఆత్మకూర్ఎం మండల కేంద్రంలోని రాయగిరి-మోత్కూరు ప్రధాన రహదారిపై తిమ్మాపురం క్రాస్ రోడ్డు వద్ద ద్విచక్రవాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొందని స్థానికులు తెలిపారు. ప్రమాదంలో బైక్పై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా, ఆసుపత్రికి తరలించారు. గాయపడిన తిమ్మాపూర్కు చెందిన చామల రమేశ్గా గుర్తించారు.
News March 15, 2025
VZM: కన్న తండ్రి ముందే విషం తాగి మృతి

దొంగతనం నింద తనపై మోపారని మనస్తాపానికి గురైన ఓ యువకుడు కన్న తండ్రి ముందే విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన భోగాపురం మండలం అమకాంలో ఈనెల 11న చోటుచేసుకోగా సదరు యువకుడు చికిత్స పొందుతూ నిన్న మృతి చెందాడు. సమీపంలోని ఓ రిసార్ట్స్లో పనిచేస్తున్న అప్పలనాయుడు.. టూరిస్ట్ సెల్ ఫోన్ దొంగలించాడని యాజమాన్యం నిందించడంతో అవమానంగా బావించి పురుగు మందు తాగాడు. చికిత్స పొందుతూ శుక్రవారం చనిపోయాడు.