News February 27, 2025
వికారాబాద్ జిల్లా నేటి కార్యక్రమాలు

✓ పూడూరు: నేడు కంకల్ వీరభద్రేశ్వర స్వామి రథోత్సవం.✓ దుద్యాల: నేడు పోలేపల్లి ఎల్లమ్మను దర్శించుకోనున్న పాలమూరు ఎంపీ డీకే అరుణ.✓ కొడంగల్: నేడు గాడిబాయి శివాలయంలో అన్నదాన కార్యక్రమం.✓ తాండూర్: నేడు భూకైలాస్లో పల్లకిసేవ, నేడు ఆయ నియోజకవర్గాల్లో పర్యటించనున్న స్పీకర్.✓ పరిగి: నేడు బ్రహ్మసూత్ర శివాలయంలో శివపార్వతుల కళ్యాణం, ఉత్సవ విగ్రహాల ఊరేగింపు.
Similar News
News February 27, 2025
EAPCET ప్రవేశాల్లో సవరణలు

తెలంగాణలో ఇంజినీరింగ్, వృత్తివిద్య కోర్సుల్లో ప్రవేశాలకు <
News February 27, 2025
NZB జిల్లాలో ఎంత శాతం పోలింగ్ నమోదైందంటే?

నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలతో కూడిన కరీంనగర్ శాసన మండలి ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ నిజామాబాద్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లా వ్యాప్తంగా 81 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ నిర్వహించారు. కాగా పోలింగ్ ముగిసే సమయానికి పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి 76.78 శాతం, ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి 92.46 శాతం పోలింగ్ నమోదయ్యింది.
News February 27, 2025
సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 94.96 శాతం పోలింగ్

సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ గురువారం ప్రశాంతంగా ముగిసింది. జిల్లా వ్యాప్తంగా 23 పోలింగ్ కేంద్రాల్లో 2,664 మంది మంది ఓటర్లకు గాను 2,530 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో పురుషులు 1,702 మందికి గాను 1,619, మహిళలు 962 మందికి గాను 911 మంది ఓటు వేశారు. దీంతో జిల్లా వ్యాప్తంగా 94.96 శాతం పోలింగ్ నమోదయింది.