News February 21, 2025
వికారాబాద్ జిల్లా నేటి టాప్ న్యూస్

✓ పోలేపల్లి ఎల్లమ్మ జాతర ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్,ఎస్పీ.✓అభివృద్ధి పనులు ప్రారంభించిన స్పీకర్.✓ మహా కుంభమేళకు హాజరైన చేవెళ్ల ఎంపీ దంపతులు.✓ బషీరాబాద్ అమ్మాయికి అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్.✓ పరిగి,పెద్దెముల్ నుంచి శ్రీశైలానికి పాదయాత్రగా బయలుదేరిన శివ స్వాములు.✓ రేపు పోలేపల్లి రానున్న సీఎం రేవంత్ రెడ్డి..భద్రత ఏర్పాట్లు పరిశీలించిన మల్టీజోన్-2 ఐజీ సత్యనారాయణ.
Similar News
News November 16, 2025
రాజస్థాన్ కొత్త CSగా ఓయూ ఓల్డ్ స్టూడెంట్

రాజస్థాన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన సీనియర్ ఐఏఎస్ అధికారి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి. 1987లో బీటెక్ (కెమికల్ ఇంజినీరింగ్), ఆ తరువాత ఎంటెక్ పూర్తిచేసిన శ్రీనివాస్ సివిల్స్లో విజయం సాధించి ఐఏఎస్ అధికారిగా నియమితులయ్యారు. అనేక పదవుల్లో పనిచేసిన ఆయన తాజాగా రాజస్థాన్ చీఫ్ సెక్రటరీగా నియమితులయ్యారు. ఈనెల 17న శ్రీనివాస్ సీఎస్గా బాధ్యతలు స్వీకరిస్తారు.
News November 16, 2025
దిష్టిలో ఉన్న శాస్త్రీయత ఏమిటి..?

చిన్నపిల్లలు ఆహారం సరిగా తీనకపోయినా, విరేచనాలైనా దిష్టి తగిలిందని పెద్దలు అంటుంటారు. దిష్టి తీశాక పిల్లలు చలాకీగా ఆడుకుంటారు. దీని వెనకున్న సైన్స్ ఏంటంటే.. మన కళ్లకు సౌమ్యదృష్టి, క్రూర దృష్టి అనేవి ఉంటాయి. ఈ చూపుల ప్రభావంతో శరీరం నలతకు గురవుతుంది. ఉప్పు, మిరపకాయతో దిగదీయుట, వాటిని నిప్పులో వేయుట వలన వచ్చే పొగ ముక్కు ద్వారా పీల్చుకోవడం వలన నలత దూరమై, శరీరాన్ని తేలిక చేస్తుంది. <<-se>>#Scienceinbelief<<>>
News November 16, 2025
కర్మయోగి భారత్లో ఉద్యోగాలు

కర్మయోగి భారత్ 8 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 6 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, B.COM, B.Sc, బీటెక్, BE, LLB, PG, M.Sc, ME, ఎంటెక్, MBA, PGDM, MCA ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 50ఏళ్లు. షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: igotkarmayogi.gov.in


