News March 14, 2025

వికారాబాద్ జిల్లా నేటి టాప్ న్యూస్

image

√ VKB: ఇంటర్ పరీక్షలకు 257 మంది విద్యార్థుల గైర్హాజరు √ పూడూరు:ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి: జిల్లా కలెక్టర్ √ తాండూరు:ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ముగ్గురు నూతన లెక్చరర్ల జాయినింగ్ √ VKB: సీఎంఆర్ చెల్లించకుంటే కఠిన చర్యలు:అ. కలెక్టర్ √ జిల్లా వ్యాప్తంగా పలు పాఠశాలలో హోలీ సంబరాలు √బొంరాస్పేట: సీఐటీయూ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్ల నిరసన √ ప్రశాంత వాతావరణంలో హోలీ వేడుకలు జరుపుకోవాలి: ఎస్సైలు.

Similar News

News December 2, 2025

టీటీడీ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి అర్హతల నిర్ణయం

image

టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి నియామకంలో కొన్ని అర్హతలకు సంబంధించి సవరణలు చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. సంస్కృతం, తమిళం, తెలుగు భాషల మీద పట్టు, పీహెచ్డీతో పాటు మరికొన్ని అర్హతలు కలిగి ఉండాలంది. నేరుగా నియామకం లేదా డిప్యూటేషన్ ద్వారా నియామకం చేసుకోవచ్చని జీవోలో పేర్కొంది. ఏవైనా అభ్యంతరాలు ఉంటే 30 రోజుల్లో తెలపాలని సూచించారు.

News December 2, 2025

సైబర్‌ నేరాలకు ‘ఫుల్‌స్టాప్‌’.. అవగాహనతోనే పరిష్కారం

image

మారుతున్న సాంకేతిక యుగంలో సైబర్‌ నేరాలపై ప్రజలకు పూర్తిస్థాయి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని కరీంనగర్‌ సీపీ గౌష్ ఆలం అన్నారు. సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ‘ఫ్రాడ్‌ కా ఫుల్‌స్టాప్‌ – సైబర్‌ క్లబ్‌’ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించి, పోస్టర్ రిలీజ్ చేశారు. విద్యార్థులు, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌ క్యాడెట్‌లు ముందుకు వచ్చి సైబర్‌ సేఫ్టీ అంబాసిడర్లుగా ఎదగాలని సీపీ పిలుపునిచ్చారు.

News December 2, 2025

అంబేద్కర్ భవన్‌లో రేపు దివ్యాంగుల దినోత్సవం

image

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం-2025 వేడుకలు రేపు నిర్వహించనున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు అంబేద్కర్ భవన్‌లో ఉదయం 9:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వివిధ కార్యక్రమాలు ఉంటాయని జిల్లా సంక్షేమ శాఖ అధికారి తెలిపారు. అనంతరం గతంలో నిర్వహించిన క్రీడా పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేయనున్నారు.