News January 30, 2025
వికారాబాద్ జిల్లా నేటి ముఖ్యంశాలు

✓ జిల్లా వ్యాప్తంగా ఘనంగా మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమాలు.✓ కోట్పల్లి పోలీస్ స్టేషన్ను సందర్శించిన ఎస్పీ నారాయణరెడ్డి.✓ కొడంగల్లో కస్తూర్బా గాంధీ పాఠశాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్.✓ దుద్యాల మండలంలో నూతన ఎంపీడీవో కార్యాలయం ప్రారంభం.✓ ప్రభుత్వం హామీలు అమలు చేయాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గాంధీజీకి వినతి పత్రాలు.✓ కొడంగల్లో కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాధ్కు పోలీసుల గౌరవ వందనం.
Similar News
News December 13, 2025
క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంచుతాయి: కలెక్టర్

గోదావరి క్రీడోత్సవాల్లో భాగంగా శనివారం భీమవరం ఎస్ఆర్ కెఆర్ ఇంజినీరింగ్ కళాశాల క్రీడా ప్రాంగణంలో కలెక్టర్ చదలవాడ నాగరాణి భీమవరం డివిజన్ ఉద్యోగుల క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..గోదావరి క్రీడోత్సవాల్లో భాగంగా నేటి నుంచి జిల్లావ్యాప్తంగా రెవెన్యూ డివిజన్ల వారీగా పోటీలు ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంచుతాయని అన్నారు.
News December 13, 2025
ఈనెల 18న ఆత్మకూరులో కబడ్డీ జిల్లా సెలక్షన్స్

యాదాద్రి భువనగిరి జిల్లా స్థాయి సీనియర్ కబడ్డీ సెలక్షన్స్ డిసెంబర్ 18న ఆత్మకూరు జెడ్పీహెచ్ఎస్లో జరుగుతాయని జిల్లా మోడ్రన్ కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు పూర్ణచందర్ రాజ్ తెలిపారు. ఆసక్తిగల క్రీడాకారులు 18వ తేదీ ఉదయం 9 గంటలకు ఆధార్ కార్డుతో పీఈటీ ఇందిరకి రిపోర్ట్ చేయాలని సూచించారు. ఎంపికైన జట్టు డిసెంబర్ 25న ఖమ్మంలో ఆడునుందని పేర్కొన్నారు.
News December 13, 2025
చౌటుప్పల్: ‘ఆస్తులు పెరిగితే గ్రామానికే రాసిస్తా’

యాదాద్రి జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఇందులో భాగంగా చౌటుప్పల్ మండలంలో దేవలమ్మ నాగారం సర్పంచ్ అభ్యర్థి కొండ హారిక విజయ్ వినూత్నంగా హామీ ఇచ్చారు. ఎన్నికల అనంతరం తన ఆస్తులు పెరిగితే ఆ పెరిగిన ఆస్తులన్నింటినీ గ్రామాభివృద్ధికి ప్రజల పేరున రాసిస్తానని బాండ్ పేపర్పై రాసి ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు. కాగా హారిక విజయ్ హామీ ప్రస్తుతం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.


