News February 12, 2025

వికారాబాద్ జిల్లా నేటి ముఖ్యాంశాలు

image

✓ ఏసీబీ వలలో ధరూరు ఎస్సై వేణుగోపాల్ గౌడ్.✓ కోట్ పల్లి: గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి:స్పీకర్.✓ కొడంగల్: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ నాయకులు.✓ కొడంగల్, యాలాల మండలాల్లో ఎన్నికల సిబ్బందికి శిక్షణ.✓ VKB:ఈనెల 13న లగచర్ల రైతులతో సంప్రదింపులు:కలెక్టర్.✓ VKB:ఎన్నికల్లో ROలదే కీలక బాధ్యత:కలెక్టర్.✓VKB:అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు:స్పీకర్.

Similar News

News December 4, 2025

రంగారెడ్డి కలెక్టరేట్‌లో ACB దాడులు

image

రంగారెడ్డి కలెక్టరేట్ అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే, ల్యాండ్స్ రికార్డు ఆఫీసులో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఏడీ సర్వేయర్ శ్రీనివాస్‌‌కు చెందిన గచ్చిబౌలిలోని మైత్రి హోమ్స్‌లోని ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలతో 3 బృందాలుగా హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో 6 చోట్ల సోదాలు జరుగుతున్నాయి.

News December 4, 2025

చండూరు: సర్పంచ్ బరిలో అక్కాచెల్లెళ్లు

image

చండూరు మండలం ఉడుతలపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెల్లెళ్లు బరిలో నిలవడంతో ప్రజల్లో ఉత్కంఠ పెరిగింది. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిగా కావలి స్వాతి పోటీ చేస్తుండగా, కావలి శివాని స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఈ ఇద్దరి మధ్యే గట్టి పోటీ ఉంటుందని గ్రామ ప్రజలు భావిస్తున్నారు. ఈ పోరులో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి.

News December 4, 2025

విశాఖలో నేవీ అమరవీరులకు నివాళి

image

విశాఖ బీచ్ రోడ్డులోని ‘విక్టరీ ఎట్ సీ’ వద్ద తూర్పునౌకదళ అధికారులు, కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అమరులైన నావిక దళ వీరులకు నివాళులర్పించారు. రక్షణ వ్యవస్థలో తూర్పునౌకదళం కీలకంగా పనిచేస్తుందని వారు కొనియాడారు. నేవీ డే సందర్భంగా గురువారం ఉదయం ఈ కార్యక్రమం నిర్వహించారు. కాగా ఈ ఏడాది విశాఖలో నేవీ డే విన్యాసాలను నిర్వహించకపోవడంతో నగరవాసులు నిరుత్సాహానికి గురయ్యారు.