News March 10, 2025

వికారాబాద్ జిల్లా నేటి ముఖ్యాంశాలు

image

✓ VKB: ప్రజావాణికి వచ్చే సమస్యలను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్
✓ VKB: జిల్లావ్యాప్తంగా 116 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు గైర్హాజరు
✓ పరిగి: ఇందిరమ్మ కమిటీల ద్వారానే ఇళ్ల పంపిణీ: MLA
✓ పరిగి: ఘనంగా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
✓ కొడంగల్: వీరభద్రేశ్వర స్వామి విగ్రహ పున:ప్రతిష్ఠాపన కార్యక్రమం
✓ తాండూర్: జిల్లాలో సావిత్రిబాయిఫూలే వర్ధంతి 
✓ బొంరాస్‌పేట: ఇసుక డంపులు సీజ్

Similar News

News February 11, 2026

పాలమూరు: నేడే మున్సి‘పోల్’.. కాసేపట్లో..

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ఒక మున్సిపల్ కార్పొరేషన్, 18 మున్సిపాలిటీల్లో ఎన్నికల నగారా మోగింది. మరికాసేపట్లో (ఉదయం 7 గం.) పోలింగ్ ప్రారంభం కానుంది. మొత్తం 373 డివిజన్, వార్డులకు పోలింగ్ జరగనుంది. ఓటర్ల సౌకర్యార్థం జిల్లావ్యాప్తంగా 632 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. ఈ ఎన్నికల విధుల్లో మొత్తం 6,234 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు.

News February 11, 2026

జిల్లాలో 1170 టీబీ కేసులు: HNK డీఎంహెచ్ఓ

image

జిల్లాలో 1170 టీబీ కేసులు గుర్తించినట్లు HNK డీఎంహెచ్ఓ అప్పయ్య తెలిపారు. మంగళవారం కలెక్టర్‌తో జరిగిన సమావేశంలో డీఎంహెచ్ఓ అప్పయ్య మాట్లాడుతూ.. టీబీ ముక్త్ భారత్ అభియాన్‌లో 1,98,000 మంది వలనరబుల్ జనాభాకు గాను 1,82,359 మందికి పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. ఇందులో 1,170 కొత్తగా టీబీ కేసులు గుర్తించినట్లు వెల్లడించారు. అలాగే 511 న్యూట్రిషన్ కిట్‌లు అందించినట్లు పేర్కొన్నారు.

News February 11, 2026

RR: ఒక ఓటుతో తారుమారు కావచ్చు.. ఓటేయండి

image

ఐదేళ్లకోసారి తమను పరిపాలించే నాయకులను ఎన్నుకునే అవకాశం ఓటు రూపంలో లభిస్తుంది. ఒక్క ఓటే కదా, వేయకపోతే ఏమవుతుందని అనుకుంటే పెద్దతప్పు చేసినట్లే. ఎన్నికల ఫలితాల్లో ఒకటి, రెండు ఓట్ల తేడాతో ఫలితాలు తారుమారైన సందర్భాలు అనేకం ఉన్నాయి. ప్రజల బాగోగులు పట్టించుకునేవారికి పదవి కట్టబెట్టి, మాయమాటలు చెప్పేవారికి బుద్ధి చెప్పే విలువైన వజ్రాయుధం ఓటు అని అందరూ గుర్తించాలి.