News March 16, 2025
వికారాబాద్ జిల్లా నేటి ముఖ్యాంశాలు

✓VKB:ప్రజా సమస్యల పరిష్కారానికి పోరుబాట:జాన్ వెస్లీ.✓VKB: జిల్లావ్యాప్తంగా ఇంటర్ పరీక్షలకు 117 మంది గైర్హాజరు.✓VKB:అభివృద్ధికి సహకరిస్తున్న రైతులను అభినందించిన కలెక్టర్ ప్రతిక్ జైన్.✓TDR:త్రాగునీటి కోసం కాళీ బిందెలతో మహిళల నిరసన.✓VKB:ఈనెల 26న వాహనాల బహిరంగ వేలం పాట:ఎస్పి.✓ కుల్కచర్ల:పాంబండ రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల వాల్పోస్టర్ ఆవిష్కరణ.✓ జిల్లాలో ఘనంగా కాన్సిరాం జయంతి కార్యక్రమాలు.
Similar News
News October 23, 2025
పెద్దపల్లి: రిటైల్ మద్యం దుకాణాల కేటాయింపు డ్రా ప్రకటన

2025-27 రిటైల్ మద్యం దుకాణాల (A4 లిక్కర్ షాపులు) కేటాయింపుల కోసం డ్రా అక్టోబర్ 27న ఉదయం 11 గంటలకు పెద్దపల్లి బంధంపల్లిలోని స్వరూప గార్డెన్స్‌లో నిర్వహించనున్నట్లు జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్ అధికారి మహిపాల్ రెడ్డి ప్రకటించారు. కమిషనర్ ఆదేశాల మేరకు జరిగే ఈ డ్రాకు దరఖాస్తుదారులు విధిగా హాజరై సహకరించాలని కోరారు. షాపుల కేటాయింపులో పారదర్శకతకై ఈ డ్రా చేపడుతున్నట్లు వివరించారు.
News October 22, 2025
బాధితుల సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలి: కలెక్టర్

కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఎస్సీ, ఎస్టీ కేసుల్లో బాధితులకు నష్టపరిహారం వేగంగా అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సూచనలను షెడ్యూల్ కులాలు, తెగల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఆమె తెలిపారు. సీఎం SP వినీత్‌తో కలిసి ఈ సమావేశంలో పాల్గొన్న కలెక్టర్, బాధితుల సమస్యలను వేగవంతంగా పరిష్కరించడానికి అధికారులను కట్టుబడి పనిచేయాలన్నారు.
News October 22, 2025
విశాఖ రైతు బజార్లలో డ్రా ద్వారా 129 మందికి స్టాల్స్ మంజూరు

విశాఖలోని రైతు బజార్లలో స్టాల్స్ కేటాయింపుల కోసం డ్రా నిర్వహించారు. దరఖాస్తు చేసిన వారిలో 129 మంది రైతులకు రైతు కార్డులు మంజూరు చేసినట్లు జేసీ మయూర్ అశోక్ తెలిపారు. డ్రా ప్రక్రియను కలెక్టరేట్‌లో అధికారులు, రైతుల సమక్షంలో నిర్వహించారు. ఎంపికైన వారికి త్వరలో రైతు బజార్లలో స్టాల్స్ కేటాయించనున్నారు.