News March 16, 2025
వికారాబాద్ జిల్లా నేటి ముఖ్యాంశాలు

✓VKB:ప్రజా సమస్యల పరిష్కారానికి పోరుబాట:జాన్ వెస్లీ.✓VKB: జిల్లావ్యాప్తంగా ఇంటర్ పరీక్షలకు 117 మంది గైర్హాజరు.✓VKB:అభివృద్ధికి సహకరిస్తున్న రైతులను అభినందించిన కలెక్టర్ ప్రతిక్ జైన్.✓TDR:త్రాగునీటి కోసం కాళీ బిందెలతో మహిళల నిరసన.✓VKB:ఈనెల 26న వాహనాల బహిరంగ వేలం పాట:ఎస్పి.✓ కుల్కచర్ల:పాంబండ రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల వాల్‌పోస్టర్ ఆవిష్కరణ.✓ జిల్లాలో ఘనంగా కాన్సిరాం జయంతి కార్యక్రమాలు.
Similar News
News April 22, 2025
పాలమూరు: భూభారతి చట్టంలో కొన్ని వివరాలు..

✓ఇష్టారీతిగా భూ రికార్డుల్లో మార్పులు చేయడం, మోసపూరితంగా భూమి హక్కులు, పట్టాలను పొందితే వాటిని వెంటనే రద్దు చేస్తారు. ✓అసైన్డ్, వక్ఫ్, దేవాదాయ భూములను ఎవరైనా పట్టాలుగా పొందితే ఆ భూములన్నీ రద్దవుతాయి.✓భూములు అన్యాక్రాంతం అయినట్టుగా అనుమానాలున్నా ప్రజలు నేరుగా సీసీఎల్ఏకు ఫిర్యాదు చేయవచ్చు.✓దరఖాస్తుల పరిష్కారంలో రెవెన్యూ అధికారుల నిర్ణయాలపై అభ్యంతరాలు ఉంటే కూడా అప్పీల్‌కు వెళ్లేందుకు అవకాశం ఉంది.
News April 22, 2025
వనపర్తి: ఓపెన్ టెన్త్ పరీక్షలకు 42 మంది గైర్హాజరు

వనపర్తి బాలికల ఉన్నత పాఠశాలలో ఓపెన్ టెన్త్ పరీక్షలను ఏప్రిల్ 20 నుంచి ప్రారంభం కాగా 26వరకు జరగనున్నాయని అధికారులు చెబుతున్నారు. సోమవారం 349మంది విద్యార్థులు SSC పరీక్షలు రాయాల్సి ఉండగా 307మంది విద్యార్థులు రాశారని, 42మంది గైర్హాజరు అయ్యారని ఓపెన్ SSC, INTER స్కూల్స్ జిల్లా కోఆర్డినేటర్ రవీందర్ రెడ్డి తెలిపారు. ఓపెన్ ఇంటర్ పరీక్ష 491మంది రాయల్సి ఉండగా 435 మంది రాశారని, 56 మంది గైర్హాజరయ్యారన్నారు.
News April 22, 2025
కడప: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

ఉమ్మడి కడప జిల్లాలోని కోడూరు శాంతినగర్ బ్రిడ్జి వద్ద బైకు అదుపుతప్పి డివైడర్ ఢీకొనడంతో చియ్యవరం పంచాయతీ నడింపల్లికు చెందిన చరణ్ (28) తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో తిరుపతిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై నవీన్ బాబు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు.