News March 5, 2025
వికారాబాద్ జిల్లా మంగళవారం ముఖ్యాంశాలు

✓ వికారాబాద్ జిల్లాలో ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి.✓ తాండూర్: టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలుపు పట్ల పీఆర్టీయు సంబరాలు.✓ తాండూర్: ఏఐ బోధనను పకడ్బందీగా నిర్వహించాలి:డీఈవో.✓ వికారాబాద్:LRSను సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా కలెక్టర్.✓ పరిగి: గిరిజన తండాల అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం:ఎమ్మెల్యే.✓ వికారాబాద్:KGBV హాస్టల్‌ను పరిశీలించిన GCDO శ్రీదేవి.
Similar News
News March 5, 2025
ఐదు నెలల క్రితమే వివాహం.. ఇంతలోనే విషాదం

కార్వేటినగరం(మం)లో విషాదం నెలకొంది. ఆళత్తూరు వాసి శ్రావణ్ తన ఫ్రెండ్ చెన్నకేశవులతో కలిసి ఓ పుట్టిన రోజు వేడుకకు కొల్లాంగుట్టకు బైకు మీద వెళ్లారు. తిరిగు ప్రయాణంలో వారు ప్రయాణిస్తున్న బైకును కొల్లాగుంట చెక్ పోస్ట్ సమీపంలో మరో బైకు వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ఘటనలో శ్రావణ్(25) అక్కడికక్కడే మృతి చెందాడు. చిన్నకేశవులు తీవ్రంగా గాయపడ్డాడు. శ్రావణ్‌కు ఐదు నెలల క్రితమే వివాహం కాగా.. ఆమె గర్భిణి.
News March 5, 2025
సూర్యాపేట: అంగన్ వాడీ కేంద్రాల్లో కొలువులు

సూర్యాపేట జిల్లాలో అంగన్ వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న కొలువులు (ఉద్యోగాలను) భర్తీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారం, పూర్వ ప్రాథమిక విద్యను అందించేందుకు వీలుగా అంగన్ వాడీ టీచర్, ఆయా పోస్టులను భర్తీ చేయనున్నారు. జిల్లాలో 61 టీచర్ పోస్టులు, 191 ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
News March 5, 2025
HYD: రాయదుర్గంలో యువతి సూసైడ్ (UPDATE)

రాయదుర్గంలో వికారాబాద్ జిల్లాకు చెందిన దేవిక(25) సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఆమె ఆత్మహత్యకు అదనపు కట్నం కోసం వేధింపులే కారణమని మృతురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లి అయిన 6 నెలలకే కూతురు చనిపోవడంతో కన్నీరు పెట్టుకుంది. భర్త శరత్ చంద్రను అరెస్ట్ చేస్తామని పోలీసులు వెల్లడించారు. దేవిక మృతదేహానికి ఉస్మానియాలో పోస్ట్‌మార్టం నిర్వహించిన అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు.