News January 25, 2025
వికారాబాద్ జిల్లా వాసులకు ముఖ్య గమనిక

అనంతగిరి గుట్ట పైనుంచి రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఇదివరకు గుట్టపైన సీసీ రోడ్డు పనులు చేపట్టడంతో ప్రత్యామ్నాయ మార్గాల్లో రాకపోకలు సాగించారు. తాజాగా అనంతగిరి గుట్టపై సీసీ రోడ్డు పనులు పూర్తి చేశారు. దీంతో అనంతగిరి గుట్ట నుంచి రాకపోకలు ప్రారంభమయ్యాయి. పనులు పూర్తవడంతో జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News December 4, 2025
MDK: స్థానిక ఎన్నికలపై దృష్టి సారించిన మాజీ ఎమ్మెల్యే

రామాయంపేట మండల వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ స్థానాలను పూర్తిగా కైవసం చేస్తున్నందుకు కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతుంది. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మండలంపై ప్రత్యేక దృష్టి సారించారు. అన్ని గ్రామాలలో సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకునే విధంగా పార్టీ నుంచి ఇద్దరు అభ్యర్థులు పోటీ చేస్తే గెలుపొందే అభ్యర్థులను మద్దతు తెలుపుతూ ఇతరులు వైదొలగే విధంగా బుజ్జగిస్తున్నారు.
News December 4, 2025
వరంగల్: ఎన్నికల బరిలో తల్లీకూతుళ్లు

నల్లబెల్లి మండల కేంద్రంలోని ఐదో వార్డులో వార్డు మెంబర్గా తల్లీకూతుళ్లు బరిలోకి దిగడం చర్చనీయాంశంగా మారింది. తల్లి జక్కోజు సరోజనని బీజేపీ బలపరచగా.. కూతురు ముషిక చైతన్యను బీఆర్ఎస్ బలపరిచింది. తల్లీకూతుళ్లు ఒకేసారి రాజకీయ రంగంలో నిలవడం గ్రామంలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ప్రజల సమస్యలను నేరుగా అర్థం చేసుకుని పరిష్కరించాలనే సంకల్పంతో ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని వారు పేర్కొన్నారు.
News December 4, 2025
76 సర్పంచ్ స్థానాల కోసం 295 మంది పోటీ

జిల్లాలో 76 గ్రామపంచాయతీలలో సర్పంచ్ స్థానాల కోసం 295 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. తొలి విడత ఎన్నికలలో రుద్రంగి, కోనరావుపేట, చందుర్తి, వేములవాడ, వేములవాడ రూరల్ మండలాలలో 85 సర్పంచ్ స్థానాల కోసం ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుండగా ఇందులో 9 గ్రామాల సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 76 గ్రామాలలో 295 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.


