News February 2, 2025

వికారాబాద్ జిల్లా సీపీఎస్ సంఘం నూతన కార్యవర్గం

image

వికారాబాద్ జిల్లా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం(సీపీఎస్) సంఘం నూతన కార్యవర్గాన్ని ఆదివారం వికారాబాద్లో ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా రాజకుమార్, ప్రధాన కార్యదర్శి ఇల్లూరి క్రాంతికుమార్, ఉపాధ్యక్షులుగా నరసింహ రాజు, అసోసియేషన్ ప్రెసిడెంట్గా సుందర్, సంయుక్త కార్యదర్శిగా రవీందర్, కార్యదర్శిగా శ్రీనివాస్, ఈసి మెంబర్స్‌గా అనిల్, తిరుపతి, రాజారత్నంలను ఎన్నుకున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు దర్శన్ గౌడ్ తెలిపారు.

Similar News

News December 5, 2025

రేపు వాయిదా పడిన డిగ్రీ పరీక్ష నిర్వహణ

image

యోగివేమన విశ్వవిద్యాలయ పరిధిలో డిసెంబర్ 1న మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించాల్సిన పరీక్ష తుఫాను కారణంగా వాయిదా పడింది. ఆరోజు జరగాల్సిన పరీక్ష ఈ నెల 6న ఉదయం 9 గంటలకు నిర్వహించనున్నట్లు డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ నారాయణరెడ్డి శుక్రవారం తెలిపారు. ఈ విషయాన్ని విద్యార్థులు గమనించాలని సూచించారు. ప్రతి విద్యార్థి పరీక్షకు తప్పక హాజరు కావాలన్నారు.

News December 5, 2025

చింతలపాలెంలో నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

image

చింతలపాలెం మండలంలోని నామినేషన్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ శుక్రవారం పరిశీలించారు. చింతలపాలెం, దొండపాడు, మేళ్లచెర్వు, రామాపురం పంచాయతీల్లోని సర్పంచ్-వార్డు సభ్యుల నామినేషన్ కేంద్రాలను ఆయన సందర్శించారు. అభ్యర్థులకు ఇబ్బందులు లేకుండా ప్రక్రియను సజావుగా నిర్వహించాలని ఆర్.ఓ.లకు సూచించారు. సందేహాలున్నవారు హెల్ప్‌డెస్క్‌ను వినియోగించుకోవాలన్నారు.

News December 5, 2025

వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డుల్లోకెక్కిన సీఎం నితీశ్

image

బిహార్ CM నితీశ్ కుమార్ అరుదైన ఘనత సాధించారు. ఇటీవల పదోసారి CMగా ప్రమాణ స్వీకారం చేయడంతో ఆయన పేరు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌(లండన్)లో చేరినట్లు JDU తెలిపింది. 2000లో తొలిసారి CM అయిన నితీశ్ వారం రోజులే పదవిలో ఉన్నారు. తర్వాత 2005 నుంచి వరుసగా 5సార్లు సీఎం అయ్యారు. సంకీర్ణ ప్రభుత్వంలో విభేదాలతో పలుమార్లు రాజీనామాలు చేసి మళ్లీ ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించారు.