News February 27, 2025
వికారాబాద్: దొంగతనానికి వచ్చి వృద్ధురాలి హత్య

మర్పల్లి మండలంలో వృద్ధురాలి హత్య కేసును పోలీసులు ఛేదించారు. డబ్బుల కోసమే హత్య చేసినట్లు గుర్తించారు. కోటమర్పల్లిలో తోకల వినోద(60) ఒంటరిగా ఉంటుంది. అదే గ్రామానికి చెందిన రాజు, శఫయుద్దీన్, నర్సింహులు.. ఈనెల 23న అర్ధరాత్రి మందు తాగి ఇంట్లో చోరీకి వెళ్లారు. వాళ్లను వినోద గుర్తించగా తమ గురించి తెలుస్తుందని బావించి పక్కనే ఉన్న బావిలో తోసేసి బీరువాలోని రూ.21వేలు ఎత్తుకెళ్లారు. నిందితులను రిమాండ్ చేశారు.
Similar News
News December 18, 2025
డాక్టర్ బాలుకు ‘ఆసియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో చోటు

తలసేమియా చిన్నారుల ప్రాణదాతగా నిలుస్తున్న కామారెడ్డికి చెందిన డాక్టర్ బాలుకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్తగా ఆయన అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ‘ఆసియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో చోటు దక్కింది. తలసేమియా బాధితుల కోసం సుమారు 5,000 యూనిట్ల రక్తాన్ని సేకరించినందుకు గాను ఈ గౌరవం దక్కింది. దేశంలోనే ఈ విభాగంలో ఈ రికార్డు సాధించడం ఇదే తొలిసారి అని బాలు తెలిపారు.
News December 18, 2025
మెదక్: ఎన్నికల్లో రూ. 1,01,32,000 స్వాధీనం

మెదక్ జిల్లాలో మూడు విడతల ఎన్నికల చేపట్టిన తనిఖీలలో రూ. 1,01,32,000 విలువైన నగదు, లిక్కర్, పిడిఎస్ బియ్యం పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు తెలిపారు. రూ. 47.48 లక్షల నగదు, 268 కేసుల్లో రూ. 26,46,968 విలువైన 3688 లీటర్ల మద్యం, రూ. 27.36 లక్షల విలువైన 673 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యము స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.
News December 18, 2025
నెల్లూరు కలెక్టర్‌కు CM ప్రశంస

అమరావతిలోని సచివాలయంలో బుధవారం CM చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా పాల్గొన్నారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యం అని CM చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. CM.. సూపర్ సిక్స్, సూపర్ హిట్ ప్రాజెక్ట్‌లో సక్సెస్ సాధించిన కలెక్టర్లను అభినందించారు. ఫైల్ క్లియరెన్స్‌లో 2వ స్థానం సాధించినందుకు హిమాన్షు శుక్లాను CM ప్రత్యేకంగా ప్రశంసించారు.


