News March 13, 2025
వికారాబాద్: నీటి ఎద్దడి రాకుండా చర్యలు చేపట్టాలి: డీపీవో

వేసవి కాలం నేపథ్యంలో ప్రజలకు తాగునీటి సమస్య రాకుండా తగు చర్యలు తీసుకోవాలని, అలాగే ప్రతి ఒక్కరూ గ్రామాల్లో వంద శాతం ట్యాక్స్ డబ్బులు వసూలు చేయాలని జిల్లా పంచాయతీ అధికారిణి, డాక్టర్ జయసుధ సూచించారు. ఆమె ధారూర్ మండలంలో గ్రామ పంచాయతీల్లో ఫీల్డ్ ఇన్స్పెక్షన్ నిర్వహించారు. చింతకుంట, కెరెల్లి గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించారు.
Similar News
News November 18, 2025
కామారెడ్డి: ఇందిరమ్మ ఇళ్ల పురోగతిని పరిశీలించిన కలెక్టర్

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మంగళవారం శాబ్దీనగర్ గ్రామాన్ని సందర్శించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం పనుల పురోగతిని పరిశీలించి లబ్ధిదారురాలు చింతల సుమలత ఇంటి నిర్మాణ పనులను పరిశీలించారు. పనుల తీరు, బ్యాంక్ రుణం, ఇప్పటివరకు చేసిన వ్యయం, ఇసుక సరఫరా వంటి అంశాలపై లబ్ధిదారులతో ప్రత్యక్షంగా మాట్లాడారు. ఇసుక ఇబ్బందులు తలెత్తకుండా, పారదర్శకంగా పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

మందమర్రి: విధుల్లో తల్లికి బదులు కొడుకు

మందమర్రి ఎంపీడీవో కార్యాలయంలో ఆరు నెలలుగా తల్లికి బదులు ఆమె కొడుకు విధులు నిర్వహిస్తున్నట్లు స్థానికులు ఆరోపించారు. కార్యాలయంలో ముగ్గురు ఆఫీస్ సబార్డినేట్లు పనిచేస్తుండగా అందులో ఒకరి స్థానంలో ఆమె కొడుకు విధులు నిర్వహిస్తున్నాడు. అయితే అతడిని ఎంపీడీవో డ్రైవర్గా ఉపయోగించుకుంటున్నాడని పేర్కొన్నారు. దీంతో ఇద్దరు ఆఫీస్ సబార్డినేటర్లపై అధిక భారం పడుతుందన్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.