News March 5, 2025
వికారాబాద్: నేటి నుంచి ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు

నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ప్రథమ సంవత్సరం పరీక్షలకు 7,914 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు ఇంటర్ బోర్డు మోడల్ అధికారి శంకర్ నాయక్ తెలిపారు. పరీక్షల నిర్వహణకు 29 పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేసి విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించినట్లు పేర్కొన్నారు. పరీక్ష ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగనుంది. గంట ముందే పరీక్షా కేంద్రంలోకి చేరుకోవాలన్నారు.
Similar News
News February 27, 2026
గద్వాలలో రూ.210 కోట్ల దివాలా పిటిషన్.. పెను సంచలనం

గద్వాల జిల్లా కేంద్రంలో భారీ ఆర్థిక కుంభకోణం వెలుగుచూసింది. నంద్యాల జిల్లా డోన్‌కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రీనివాసరెడ్డి రూ.210 కోట్లకు దివాలా పిటిషన్ గద్వాల కోర్టులో దాఖలు చేయడం తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరులోనూ కలకలం రేపుతోంది. ఈ భారీ మొత్తాన్ని అమెరికాకు మళ్లించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ వ్యవహారం వెనుక ఉన్న అసలు నిజాలు బయటపడాలని బాధితులు కోరుతున్నారు.
News February 27, 2026
సంగారెడ్డి: మార్చి 1 నుంచి పోలీస్ యాక్ట్: ఎస్పీ

సంగారెడ్డి జిల్లాలో మార్చి 1 నుంచి 31 వరకు పోలీస్ యాక్ట్ 30, 30(ఎ) అమలులో ఉంటుందని ఎస్పీ పారితోష్ పంకజ్ తెలిపారు. పోలీసుల అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించవద్దని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.
News February 27, 2026
రెంటచింతలలో వివాహిత ఆత్మహత్య

రెంటచింతల మండలం మంచికల్లులో కుటుంబ కలహాల నేపథ్యంలో బంకూరి మల్లేశ్వరి (35) అనే వివాహిత గురువారం తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నాగార్జున తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు లోతైన దర్యాప్తు చేపట్టి, ఆత్మహత్యకు గల కారణాలను విశ్లేషిస్తున్నారు.


