News March 5, 2025
వికారాబాద్: నేటి నుంచి ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు

నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ప్రథమ సంవత్సరం పరీక్షలకు 7,914 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు ఇంటర్ బోర్డు మోడల్ అధికారి శంకర్ నాయక్ తెలిపారు. పరీక్షల నిర్వహణకు 29 పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేసి విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించినట్లు పేర్కొన్నారు. పరీక్ష ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగనుంది. గంట ముందే పరీక్షా కేంద్రంలోకి చేరుకోవాలన్నారు.
Similar News
News February 11, 2026
శివుడు లేని చోటు గలదా?

ఓ సముద్రంలో పుట్టిన అల, తను సముద్రం కంటే వేరు అనుకుంటుంది. అందుకే ప్రతిసారి ఉవ్వెత్తున ఎగసి ఒడ్డుకు వస్తుంది. కానీ అలకు మూలం, ఆధారం, అంతం ఆ సముద్రమే! అలాగే ఈ జగత్తులో మనం చూసే ప్రతి రూపం ఆ మహాశివుడనే సముద్రంలో పుట్టిన చిన్న అల మాత్రమే. రూపం చూస్తే అది మనిషిలాగో లేదా రాయిలాగో కనిపిస్తుంది. కానీ దాని సారాన్ని చూస్తేనే అది శివతత్వం అని అర్థమవుతుంది. సర్వం శివమే అని నమ్మితే ఆయన అనుగ్రహం కలుగుతుంది.
News February 11, 2026
న్యూజిలాండ్‌కు స్టార్ ఆల్‌రౌండర్ దూరం

T20 WCలో వరుస విజయాలతో జోరు మీదున్న న్యూజిలాండ్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ మైకేల్ బ్రేస్‌వెల్ గాయం కారణంగా టోర్నీకి దూరమయ్యారు. ఆదివారం వార్మప్ సమయంలో అతను గాయపడినట్లు న్యూజిలాండ్ క్రికెట్(NZC) తెలిపింది. బ్రేస్‌వెల్ స్థానంలో కోల్ మెక్‌కాంచీ రిజర్వ్ బౌలర్ బెన్ సియర్స్‌తో కలిసి జట్టులో చేరనున్నట్లు పేర్కొంది. న్యూజిలాండ్ తన మూడో మ్యాచ్ ఈ నెల 14న దక్షిణాఫ్రికాతో ఆడనుంది.
News February 11, 2026
తిరుపతి : 12వ తేదీన కిసాన్ మేళా

తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం (RARS) నందు ఈ నెల 12వ తేదీ కిసాన్ మేళా జరుగుతుందని ఆ కార్యాలయం పేర్కొంది. ఈ కార్యక్రమానికి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చన్నాయుడు, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలియజేశారు. సమగ్ర వ్యవసాయంపై రైతులకు అవగాహన సదస్సు ఉంటుందని పేర్కొన్నారు. రైతులు హాజరై కిసాన్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.


