News February 3, 2025

వికారాబాద్: పదేళ్లుగా మందు బంద్!

image

గత 10 సంవత్సరాలుగా సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తున్నారు ధారూర్ మండలం రుద్రవరం గ్రామస్థులు. నేటికి ఆ నిబంధనలకు కట్టుబడి ఉన్నారు. దీంతో ఆదివారం దిశా కమిటీ మెంబర్ డాక్టర్ రాజశేఖర్ గ్రామాన్ని సందర్శించి, ప్రజలను అభినందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు విజయలక్ష్మి, ప్యాట శంకర్, గొడుగు సుధాకర్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Similar News

News October 18, 2025

వైసీపీ జిల్లా అధ్యక్షురాలిగా అనంతలక్ష్మి

image

వైసీపీ కాకినాడ జిల్లా అధ్యక్షురాలిగా పెద్దాపురం మండలం కట్టమూరు గ్రామానికి చెందిన ఏలేటి అనంతలక్ష్మి ఎంపికయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. క్షేత్రస్థాయిలో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని ఈ సందర్భంగా అనంతలక్ష్మి అన్నారు.

News October 18, 2025

భూపాలపల్లి: మద్యం షాపులకు టార్గెట్ రీచ్ అయ్యేనా..!

image

భూపాలపల్లి జిల్లాలో మద్యం దుకాణాలకు టెండర్లు నేటితో పూర్తి కానుంది. భూపాలపల్లి, ములుగు జిల్లాల పరిధిలో 59 మద్యం దుకాణాలకు గత నెల 26 నుంచి టెండర్లు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 525 మంది నుంచి దరఖాస్తులు అందాయి. దీంతో ప్రభుత్వానికి రూ.15.27 కోట్ల ఆదాయం వచ్చింది. గతంలో 59 షాపులకు 2,161 దరఖాస్తుల రాగా, 43.22 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. ప్రస్తుతం వ్యాపారులందరూ సిండికేట్లుగా మారారు.

News October 18, 2025

కొత్తగూడెం నుంచి ప్రత్యేక పంచారామ సర్వీసులు

image

కార్తీక మాసాన్ని పురస్కరించుకొని భక్తుల కోసం కొత్తగూడెం ఆర్టీసీ విభాగం ప్రత్యేక సర్వీసులు ప్రకటించింది. కొత్తగూడెం, పాల్వంచ నుంచి పంచారామాలు (అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోట) వరకు సూపర్ లగ్జరీ బస్సు నడిపిస్తున్నామన్నారు. ఈ నెల 26న రాత్రి 9 గంటలకు బస్సు బయలుదేరుతుందన్నారు. అన్నవరంకు కూడా డీలక్స్ సర్వీసు అందుబాటులో ఉంది.