News February 26, 2025
వికారాబాద్: పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి: కలెక్టర్

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో చేపడుతున్న మరమ్మతు పనులను నాణ్యతతో త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. మంగళవారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో చేపడుతున్న మరమ్మతు పనులపై వైద్యశాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. మరమ్మతులు త్వరగా పూర్తిచేసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రజలకు సౌకర్యాలు కల్పించాలన్నారు.
Similar News
News November 15, 2025
నాగర్ కర్నూల్ జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు

జిల్లాలో రోజురోజుకూ చలి తీవ్రత పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో అమ్రాబాద్ మండలం వటవర్లపల్లిలో అత్యల్పంగా 12.0 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. వెల్దండలో 12.2, ఊర్కొండలో 12.3, కొండనాగులలో 12.4, కల్వకుర్తిలో 12.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఉదయం వేళల్లో చలి కారణంగా జిల్లా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
News November 15, 2025
సైదాపూర్: ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద మృతి

సైదాపూర్ మండలం శివరాంపల్లి గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థిని రెడ్డి అర్చన అనుమానాస్పదంగా మృతి చెందింది. శుక్రవారం కళాశాలకు వెళ్లి పరీక్ష రాసి ఇంటికి వచ్చిన అర్చన, శనివారం తెల్లవారుజామున మరణించినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News November 15, 2025
ఉష్ణోగ్రతలు పడిపోయాయి.. MBNRలో ఇదీ పరిస్థితి..!

MBNR జిల్లాలో ఐదు రోజులుగా ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో చలి తీవ్రత గణనీయంగా పెరిగింది. అత్యల్పంగా బాలానగర్ మండల కేంద్రంలో 10.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాజాపూర్‌లో 11.1, గండీడ్ మండలం సల్కర్‌పేటలో 11.3, మిడ్జిల్‌లో 12.3, కోయిలకొండ సిరివెంకటాపుర్, భూత్‌పూర్‌లో 12.7, మహ్మదాబాద్‌లో 13.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.


